Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

13న సీఐడీ కార్యాలయానికి వెళ్ళనున్న చంద్రబాబు...

chandrababu

ఠాగూర్

, శుక్రవారం, 12 జనవరి 2024 (16:51 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీ శనివారం విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. రింగ్ రోడ్డు, మద్యం, ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదేసమయంలో వారం రోజుల్లోగా దర్యాప్తు అధికారికి పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. ఈ పూచీకత్తు సమర్పించే నిమిత్తం ఆయన విజయవాడ ఏసీబీ కార్యాలయానికి వెళ్ళనున్నారు. మరోవైపు, మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నరేశ్‌తో పాటు మరికొందరు అధికారులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెల్సిందే. 
 
మతాంతర వివాహం చేసున్న ముస్లిం మహిళపై ముస్లిం యువకుల అత్యాచారం...
 
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. మతాంతర వివాహం చేసుకున్న ముస్లిం మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అంతటితో వారి కోపాగ్ని చల్లారకపోవడంతో బాధితురాలు తన భర్తతో కలిసి నడుపుతున్న హోటల్‌పై దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వారంతా ముస్లిం సామాజికవర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. కర్నాటక రాష్ట్రంలోని హవేరి జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
దంపతులు ఉన్న హోటల్‌లోకి బలవంతంగా ప్రవేశించిన దుండగులు... గది నుంచి ఆ ముస్లిం మహిళను బలవంతంగా ఈడ్చుకెళ్ళారు. ఆ తర్వాత కారులో ఎక్కించుకుని నిర్మానుష్యంగా ఉండే నదీ ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడ ఆమెను చితకబాది, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గ్యాంగ్ రేప్ చేస్తున్న దృశ్యాలను దుండగుల్లో ఒకడు వీడియో తీయగా, ఇవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ దారుణ ఘటనపై ఈ నెల 7వ తేదీన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. నిందితుల పేర్లు తనకు తెలియవని, కాకపోతే అందులో ఒకడిని అఫ్తాబ్ అని మిగిలినవారు పిలవడం విన్నానని బాధితురాలు చెప్పింది. కారు డ్రైవర్ కూడా తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిపింది. 
 
మరోవైపు, మహిళ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. ఏడుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాని, వీరంతా డిశ్చార్జ్ కాగానే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. పరారీలోని నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ ఘటన కర్నాటకలో రాజకీయంగా పెను దుమారం రేపుతుంది. ఇది అత్యంత భయానకం అని కర్నాటక బీజేపీ చీఫ్ వీవై విజయేంద్ర పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ నెల 22వ తేదీన మద్యం షాపులు బంద్.. ఎందుకో తెలుసా?