Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొందరపడొద్దు... అదును చూసి దెబ్బకొడదాం : నేతలతో చంద్రబాబు

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించడం పట్ల టీడీపీ నేతలతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్

Advertiesment
తొందరపడొద్దు... అదును చూసి దెబ్బకొడదాం : నేతలతో చంద్రబాబు
, శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (18:01 IST)
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించడం పట్ల టీడీపీ నేతలతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈనేపథ్యంలో శుక్రవారం అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో మంత్రులతో పాటు టీడీపీ ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు తమ మనోభావాలను వ్యక్తంచేశారు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో కేడర్ బీజేపీ తీరుపై తీవ్ర ఆగ్రహం చెందుతూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా, బీజేపీతో పొత్తు కటీఫ్ చెప్పాలంటూ డిమాండ్లు చేస్తున్నారంటూ చంద్రబాబు ముందు వాపోయారు. 
 
వారి మాటలను సావధానంగా ఆలకించిన సీఎం చంద్రబాబు కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా, ఎన్నికలకు మరో యేడాది మాత్రమే సమయం ఉన్నందున తొందరపడొద్దనీ అదును చూసి దెబ్బకొడతామంటూ సూచింనట్టు వినికిడి. అంతేకాకుండా, పరిపాలన బాగోలేకపోతే ఏ ప్రభుత్వాన్నీ ప్రజలు ఉపేక్షించరనడానికి రాజస్థాన్ ఉపఎన్నికలే ఉదాహరణ ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు నేతలకు గుర్తు చంద్రబాబు చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసింది కాబట్టే 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో నామరూపాల్లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో కేసీఆర్‌తో, ఏపీలో జగన్‌తో లాలూచీ పడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీని దెబ్బ తీసేందుకే‌ రాష్ట్ర విభజనకు ప్రణాళికలు రచించిందని ఆరోపించారు. 
 
తాను మాత్రం రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని పట్టుబట్టినట్లు తెలిపారు. విభజన వల్ల అన్యాయం జరిగినా... కేంద్రంతో సంబంధాలు ఉంటేనే రాష్ట్రానికి ఉపయోగమని భావించి ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు చంద్రబాబు వివరించారు. గురువారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. కర్ణాటక, ముంబై, అహ్మదాబాద్‌లకు బాగానే కేటాయింపులు చేసినప్పుడు ఏపీ పట్ల ఎందుకు చిన్నచూపు చూశారని ప్రశ్నించారు. ఇలాగైతే ప్రజల్లోకి ఎలా పోతాం అని పార్టీ ఎంపీలు, నేతలు అభిప్రాయపడ్డారని సీఎం తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నా కోరిక తీర్చితే మీకు పీహెచ్‌డీలు ఇప్పిస్తా' : జేఎన్‌టీయూ ప్రొఫెసర్ వేధింపులు