Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాబూ.. మీరే సీనియర్... వెన్నుపోటులోనూ.. మీతో పోటీపడలేను : మోడీ ఫైర్

Advertiesment
Chandrababu Naidu
, ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (13:29 IST)
గుంటూరు జిల్లాలో జరిగిన ప్రజా చైతన్య సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబే సీనియర్ అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యంగా బాబుతో తాను పోటీపడలేనని, ఆయన అన్నింట్లోనూ సీనియరేనని విమర్శలతో ఉతికి ఆరేశారు. 
 
ఎన్డీయే కూటమి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా ఏపీ గడ్డపై అడుగుపెట్టారు. గుంటూరు వేదికగా చమురు నిల్వలకు సంబంధించి మూడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ఆదివారం శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. 
 
సభ ద్వారా ప్రధాని మోడీ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. అమరావతి నిర్మాణం అంటూ కూలిపోయిన తన పార్టీ నిర్మాణంలో బాబు ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మాని తన కొడుకును రాజకీయంగా నిలబెట్టే పనిలో పడ్డారన్నారు. చంద్రబాబు గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. 
 
ఎన్టీఆర్‌ వారసుడిగా చెప్పుకున్న వ్యక్తి ఎన్టీఆర్‌ కలలను ధ్వంసం చేశారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తిని నీరుగారుస్తూ కాంగ్రెస్‌తో జతకట్టారన్నారు. ఎన్టీఆర్‌ను అవమానించిన కాంగ్రెస్‌తో బాబు కలిసి నడుస్తున్నారు. కేంద్ర పథకాలకు చంద్రబాబు స్టిక్కర్‌ అంటించుకొని ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మహాకూటమి ఒక అపవిత్ర కలయిక అన్నారు. 
 
అంతేనా, తానేదో గొప్ప పథకాలను నిర్మిస్తున్నానని చంద్రబాబు చెబుతున్నారని, నిజానికి అవన్నీ కేంద్ర పథకాలేనని ఎద్దేవా చేశారు. సీఎం వ్యక్తిగత లబ్ధి పొందారే కానీ, అమరావతికి ఒనగూరిన లబ్ధి ఏమిటని ఆయన నిలదీశారు. సీనియర్ నాయకుడిగా చంద్రబాబును తాను గౌరవిస్తానని ప్రధాని చెబుతూనే 'మీరు చాలా విషయాల్లో సీనియర్' అంటూ చంద్రబాబు సీనియారిటీని వ్యంగ్యోక్తులతో ఏకరువు పెట్టారు.
 
ముఖ్యంగా, 'పార్టీ ఫిరాయింపుల్లో మీరు సీనియర్లు. కొత్త కూటమిలతో జత కలపడంలో సీనియర్లు. వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లో ముందుకు వెళ్లడంలో సీనియర్లు. విషయాల్లో నేను మీతో పోటీకి రాలేను. ఈరోజు మీరు ఎవరిని తిడతారో వారి ఒళ్లోకి చేరడంలో మీరు సీనియర్లు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలను నీరుగార్చడంలో మీరు సీనియర్. ఎన్నికల్లో ఓడిపోవడంలోనూ మీరు సీనియర్లే' అని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
 
అంతేకాకుండా, తనకంటే సీనియర్ అని చంద్రబాబు పదేపదే చెప్పుకుంటున్నారు. తన సీనియర్టీతో ఆయన ఏం సాధించారో అర్థం కావడం లేదన్నారు. సొంత మామను వెన్నుపోటు పోడవడంలో చంద్రబాబు సీనియర్‌ అన్నారు. పొత్తులు, కూటములు మార్చడంలో సీనియర్‌. ఏపీ ప్రజల స్వప్నాలు ధ్వంసం చేయడంలో సీనియర్‌. గతంలో తిట్టిన వాళ్లతో కలిసిపోవడంలోనూ సీనియర్‌. ఒక ఎన్నికల తర్వాత మరో ఎన్నికల్లో ఓడిపోవడంలోనూ బాబు సీనియరేనని అని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినయ్యా.. అయితే మాకేంటి... కన్నా వర్సెస్ పోలీసులు