Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ అధికారం ఉండివుంటే నిర్ణయాధికారం మీకే ఇచ్చేవాడిని : బాబుతో అద్వానీ వ్యాఖ్య

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీతో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో సమావేశమై కృష్ణా పుష్కరాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఆసక్తి

Advertiesment
LK Advani
, శనివారం, 6 ఆగస్టు 2016 (16:35 IST)
భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీతో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో సమావేశమై కృష్ణా పుష్కరాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని పార్టీలు కలిసి విభజించాయి. ఈ విభజన వల్ల ఏపీకి అన్యాయం జరగకూడదు. రాష్ట్రానికి ఏమేం ఇవ్వాలో అవన్నీ త్వరగా ఇచ్చేయాలి. ఏపీకి ఇవ్వాల్సిన వాటిని ఎందుకు పెండింగ్ పెడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. తెలంగాణ వారు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు. రాష్ట్రం ఏర్పాటైపోయింది. మరి ఆంధ్రా సంగతేంటి? ఏపీకి ఏమేం ఇవ్వాలో ఖచ్చితంగా ఇవ్వాలి. ఏపీ, తెలంగాణ, కేంద్రం నుంచి ఒక్కొక్కరు చొప్పున కూర్చుని ఈ అంశాలను తేల్చేయాలి అని అద్వానీ  వ్యాఖ్యానించినట్టు టీడీపీ వర్గాల సమాచారం. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు కల్పించుకుని ఏపీకి న్యాయం జరిగేలా చూడండని ఆయనను కోరారు. దీనికి స్పందించిన అద్వానీ ‘‘ఒకవేళ నాకే కనుక ఆ అధికారం ఉంటే... నిర్ణయాధికారం మీకే ఇచ్చేవాడిని’’ అని చంద్రబాబుతో అద్వానీ వ్యాఖ్యానించారని టీడీపీ నేతలు చెపుతున్నారు.
 
అంతకుముందు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై ఇదే అంశంపై చర్చించిన విషయం తెల్సిందే. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా గత కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కూడా రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును కూడా ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ రోడ్లపైకి రోల్స్-రాయిస్ 'డాన్'.. ధర రూ.6.25 కోట్లు!