Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేంద్రానికి బాధ్యత లేదా? ప్రధాని 2 గంటలు కూర్చుని ఆలోచిస్తే సమస్యలుండవ్: చంద్రబాబు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నీ పనులు పక్కనబెట్టి 2 గంటలు కూర్చుని ఆలోచిస్తే.. రాష్ట్ర విభజనతో ఏపీకి జరిగిన అన్యాయానికి తగిన పరిష్కారం లభిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రత్యేక హోదాపై

కేంద్రానికి బాధ్యత లేదా? ప్రధాని 2 గంటలు కూర్చుని ఆలోచిస్తే సమస్యలుండవ్: చంద్రబాబు
, ఆదివారం, 31 జులై 2016 (14:29 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నీ పనులు పక్కనబెట్టి 2 గంటలు కూర్చుని ఆలోచిస్తే.. రాష్ట్ర విభజనతో ఏపీకి జరిగిన అన్యాయానికి తగిన పరిష్కారం లభిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానం ఆమోద యోగ్యం కాదన్నారు. రాష్ట్ర విభజనతో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ విషయంలో కేంద్రానికి బాధ్యత లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. 
 
ప్రధాని కలుగజేసుకుని ఏపీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వనరులు లేకపోతే రాష్ట్ర విభజన ఎందుకు చేశారంటూ చంద్రబాబు అడిగారు. ఏపీ ప్రస్తుతం రెండు సంవత్సరాల చిన్న బిడ్డ. ఆ బిడ్డను సున్నితంగా పరిరక్షించుకుని పెద్ద చేయాలి. మెచ్యూర్డ్ కాలేదు. పెరిగి వుంటే కేంద్రం అవసరం లేకపోయి వుండవచ్చు. రాష్ట్రానికి అన్ని రాష్ట్రాల లాగానే నిధులిచ్చారు. ప్రత్యేకంగా ఏమీ లేదు. అరకొరగా డబ్బులివ్వడంతో ఏ పని పూర్తి కాదు.. రెండేళ్లు ఏం చేస్తారోనని వేచి చూశానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
 
అందుకే ప్రత్యేక హోదా కోసం, రాష్ట్ర విభజనకు తర్వాత రెండేళ్లలో ఏపీ పరిస్థితి, ఆర్థికం, వనరులు, అభివృద్ధి వంటి ఇతరత్రా అంశాలపై ఏం చేయాలో తెలియజేసేందుకు ప్రధాని గారి అపాయింట్మెంట్ అడిగి.. ఆయన్ని కలుస్తాం. ఆయన రెండు గంటల పాటు కూర్చుని ఆలోచిస్తే రాష్ట్ర సమస్యలు కొలిక్కి వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఒకవేళ ప్రధాని ఏమీ చేయనప్పుడు తదుపరి కార్యాచరణ గురించి తాను ప్రకటన చేస్తానని చంద్రబాబు వెల్లడించారు.
 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చంద్రబాబు మండిపడ్డారు. రాజ్యసభలో చర్చ ముగిసిన నేపథ్యంలో పౌరులకు ఇబ్బంది లేకుండా జపాన్‌ తరహాలో వినూత్నంగా నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 
 
తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆదివారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ ఎంపీల సమావేశం జరిగింది. అనంతరం మీడియా ప్రతినిధులతో చంద్రబాబు మాట్లాడుతూ.. తెదేపా మిత్రపక్షమైనంత మాత్రాన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో చేసిన ప్రకటన సరికాదన్నారు. 
 
జపాన్‌లో తరహాలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే రీతిలో నిరసన తెలపాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగా రహదారులు వూడ్చడం, మౌన ప్రదర్శనలు వంటి పద్ధతుల్లో నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు అన్నారు. కేంద్రం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ప్రజా చైతన్యం ద్వారానే మనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోగలమని చంద్రబాబు తెలిపారు. బస్సులను ఆపడం, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టడం వంటి చర్యల ద్వారా పౌరులకు, ప్రజా జీవనానికి భంగం వాటిల్లేలా ఉండకూడదని వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌: లోపల కూర్చుని డోరేసుకుంది.. అంతే మెషీన్ స్టార్ట్ అయ్యింది.. చనిపోయింది!