ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్: లోపల కూర్చుని డోరేసుకుంది.. అంతే మెషీన్ స్టార్ట్ అయ్యింది.. చనిపోయింది!
ఎలక్ట్రానిక్ పరికరాలతో ముప్పు తప్పదని ఈ ఘటన నిరూపించింది. ఆటోమేటిక్ వస్తువులతో తిప్పలు తప్పవని ఈ ఘటన తేల్చేసింది. వాషింగ్ మిషన్‌లో ప్రమాదవశాత్తూ మూడేళ్ల చిన్నారి చిక్కుకుని మృతి చెందింది. ఈ ఘటన అమెరిక
ఎలక్ట్రానిక్ పరికరాలతో ముప్పు తప్పదని ఈ ఘటన నిరూపించింది. ఆటోమేటిక్ వస్తువులతో తిప్పలు తప్పవని ఈ ఘటన తేల్చేసింది. వాషింగ్ మిషన్‌లో ప్రమాదవశాత్తూ మూడేళ్ల చిన్నారి చిక్కుకుని మృతి చెందింది. ఈ ఘటన అమెరికాలోని హాంప్‌టౌన్‌లో జరిగింది. ఈ ఘటనకు బాధ్యురాలిగా ఆమె తల్లి 25 ఏళ్ల బ్రూక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. బ్రూక్ నిద్రపోతుండగా ఆమె కూతురు ఆడుకుంటూ వాషింగ్ మిషన్ పైకి ఎక్కింది. ఆపై డోర్‌ను మూసుకుంది. దీంతో డోర్ మూయగానే ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయ్యే ఆ మిషన్ బట్టలు ఉతికే పనిని ప్రారంభించింది. వాషింగ్ మెషీన్ తిరుగుతూ తిరుగుతూ ఉండేసరికి చిన్నారి బయటికి రాలేకపోయింది. దీనికి తోడు వేడినీళ్లు రావడంతో తట్టుకోలేక పోయిన ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మిషన్ తిరుగుడికి, వేడినీటి ప్రభావంతోనే పాప శరీరం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. మందులేసుకోవడంతో మంచి నిద్రలో జారుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని బ్రూక్ పసిగట్టలేపోయింది.
ఈ వాషింగ్ మిషన్‌ను బాగా మురికి పట్టిన బట్టలను శుభ్రం చేసేందుకు మాత్రమే వాడతారట. ఇంకా బ్రూక్‌కు డ్రగ్ వాడే అలవాటుందని, గతంలో బ్రూక్ వెనుక సీటులో ఏడు నెలల చిన్న బిడ్డను పెట్టుకుని రాష్ డ్రైవింగ్ కూడా చేసినట్లు పోలీసుల రికార్డులో ఉంది.