Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హనుమ విహారి నిష్క్రమణపై చంద్రబాబు పైర్.. అండగా ఉంటామని ప్రకటన

hanuma vihari

వరుణ్

, మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (11:46 IST)
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నుంచి భారత క్రికెటర్ హనుమ విహారి శాశ్వతంగా తప్పుకున్నారు. భవిష్యత్‌లో ఆంధ్ర క్రికెట్ తరపున ఆడనని ప్రకటించారు. ఆంధ్ర క్రికెట్ సంఘంలో రాజకీయ జోక్యం అధికమైందని విహారి ప్రటించారు. ఏపీలోని అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నేత కుమారుడి కోసం తనను కెప్టెన్సీ నుంచి తప్పించారని విహారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట తాను ఉండలేని స్పష్టం చేశాడు. దీనిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మరో రెండు నెలల్లో మీకు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తామని హనుమ విహారికి వారిద్దరూ హామీ ఇచ్చారు. 
 
వైసీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటని చంద్రబాబు విమర్శించారు. హనుమ విహారి ఒక తెలివైన భారత అంతర్జాతీయ క్రికెటర్ అని.. ఆయన ఏపీ తరపున ఎప్పటికీ ఆడబోనని ప్రమాణ చేసే స్థాయికి టార్గెట్ చేయబడ్డాడని దుయ్యబట్టారు. హనుమా, మీరు దృఢంగా ఉండండి... క్రికెట్ పట్ల మీకున్న చిత్తశుద్ది, కమిట్మెంట్ మీ గురించి ఎంతో గొప్పగా చెపుతాయని అన్నారు. ఈ అన్యాయమైన చర్యలు ఏపీ లేదా మన ప్రజల నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించవని చెప్పారు. మేము మీకు ఎప్పుడూ అండగా ఉంటామని... మీకు న్యాయం జరగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.
 
అలాగే, నారా లోకేశ్ స్పందిస్తూ... అధికార పార్టీ రాజకీయ జోక్యం కారణంగా ఒక ప్రముఖ క్రికెటర్ అయిన హనుమ విహారి చేదు నిష్క్రమణపై తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. రెండు నెలల్లో హనుమ విహారి ఏపీ తరపున ఆడేందుకు తాను ఆహ్వానిస్తున్నానని తెలిపారు. విహారికి, ఏపీ టీమ్‌కు తాము రెడ్ కార్పెట్ పరుస్తామని... వచ్చే రంజీ ట్రోఫీని ఏపీ గెలుపొందేందుకు అవసరమైన సహాయాలన్నింటినీ అందిస్తామని హామీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భద్రత లేకుండా బెంగుళూరు వీధుల్లో బ్రిటన్ ప్రథమ మహిళ