Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ బీకాంలో ఫిజిక్స్‌ గొడవేంటి బాబూ.. విరగబడి నవ్విన చంద్రబాబు

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు సంబంధించిన 'బీకాంలో ఫిజిక్స్' అంశం ప్రస్తావనకు రాగానే సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఒక్కసారిగా నవ్వేశారట. దీనిపై పార్టీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ను సీఎం వివరణ అడిగారు.

ఈ బీకాంలో ఫిజిక్స్‌ గొడవేంటి బాబూ.. విరగబడి నవ్విన చంద్రబాబు
హైదరాబాద్ , ఆదివారం, 12 మార్చి 2017 (03:44 IST)
కృష్ణా జిల్లా నేతలతో శనివారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఒకరి నియోజకవర్గంలో మరో నేత అసలు జోక్యం చేసుకోవద్దని నేతలకు సూచించారు. బోండా ఉమామహేశ్వరరావు భూకబ్జా ఆరోపణలపై చంద్రబాబు వివరణ అడిగారని సమాచారం. ఈ సమావేశంలో అనంతపురం జిల్లా ధర్మవరం ఘటనను పార్టీ నేతలతో చంద్రబాబు ప్రస్తావించారు. కలిసి పనిచేయమంటే రాళ్ల దాడులు చేసుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని జిల్లా నేతలకు సూచించారు.
 
ఈ భేటీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు సంబంధించిన 'బీకాంలో ఫిజిక్స్' అంశం ప్రస్తావనకు రాగానే సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఒక్కసారిగా నవ్వేశారట. దీనిపై పార్టీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ను సీఎం వివరణ అడిగారు. తాను మీడియాకు చెప్పిందొకటని, అయితే వారు రాసిందొకటని తడుముకుంటూనే పార్టీ అధినేత చంద్రబాబుకు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్ తప్పును సవరించుకున్నారు..యూపీలో లెక్క సరిచేశారు. అదే కమల విజయం