Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శివప్రసాద్‌పై మండిపడుతున్న బాబు.. వేటు ఖాయమంటున్న టీడీపీ వర్గాలు

హథీరాంజీ మఠం భూములను దళితులకు ఇవ్వాలని అడిగితే కాదన్నందుకు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అంబేద్కర్ జయంతి రోజున టీడీపీ పరువు తీసేశాడంటూ ఆగ్రహిస్తున్న చంద్రబాబు ఎంపీపై వేటు వేయడానికే నిర్ణయించుకున్నారు. తాను దళితులను పట్టించుకోవట్లేదంటూ సొంత పార్టీకి చెందిన

శివప్రసాద్‌పై మండిపడుతున్న బాబు.. వేటు ఖాయమంటున్న టీడీపీ వర్గాలు
హైదరాబాద్ , ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (08:54 IST)
హథీరాంజీ మఠం భూములను దళితులకు ఇవ్వాలని అడిగితే కాదన్నందుకు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అంబేద్కర్ జయంతి రోజున టీడీపీ పరువు తీసేశాడంటూ ఆగ్రహిస్తున్న చంద్రబాబు ఎంపీపై వేటు వేయడానికే నిర్ణయించుకున్నారు. తాను దళితులను పట్టించుకోవట్లేదంటూ సొంత పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ తీవ్ర విమర్శలు చేయడంతో కంగుతిన్న ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపీపై చర్యలు తీసుకోవడానికే సిద్ధమవుతున్నారు.
 
శనివారం ఉదయం మంత్రులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ వ్యవహారంపై చర్చించిన సీఎం.. ఆ తర్వాత శివప్రసాద్‌ మరలా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో ముఖ్యనేతలతో మరోసారి చర్చించారు. ఉదయం మంత్రులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్ల ాడిన సీఎం.. శివప్రసాద్‌ విమర్శలను ప్రస్తావించి ఆయన పద్ధతి సరిగా లేదని అన్నట్లు సమాచారం. శివప్రసాద్ అలా రియాక్ట్ కావడానికి కారణం ఏంటీ అసలు  ఏం జరిగిందని చంద్రబాబు  చిత్తూరు జిల్లా నేతలను ప్రశ్నించారు. అంబేద్కర్‌ జయంతి రోజున అంతా బాగా చేయాలనుకుంటే ఆయన అదేరోజు ఇలా చేశాడేమిటని బాబు వాపోయారు.
 
పైగా ముఖ్యమంత్రినైన తనను అంత బాహాటంగా విమర్శిస్తున్నా ఎవరూ స్పందించలేదని బాబు పరోక్షంగా వ్యాఖ్యానించడంతో టెలీకాన్ఫరెన్స్‌ ముగిశాక ఎక్సైజ్‌ మంత్రి కేఎస్‌ జవహర్‌.. ఎంపీపై విమర్శలు చేశారు. అయితే ఆ తర్వాత  శివప్రసాద్‌ మరింత దూకుడుగా  విమర్శలు చేయడంతో శనివారం మధ్యాహ్నం  చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలోనే ముఖ్యనేతలతో మాట్లాడారు. 
 
ఆరునెలల నుంచి శివప్రసాద్‌ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉండట్లేదన్నారు. హథిరాంజీ మఠం భూములు దళితులకివ్వాలని అడిగాడని, ఆ పని చేస్తే పార్టీకి చెడ్డపేరు వస్తుందని చెప్పి చేయనన్నానని, దాన్ని మనసులో పెట్టుకుని అంబేడ్కర్‌ జయంతిరోజు తనపై విమర్శలు చేశాడని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది.  శివప్రసాద్‌పై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటానని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేశినేని నాని ఉంటే ఎంత పోతే ఎంత..! లగడపాటిని దువ్వుతున్న బాబు.. విజయవాడ ఎంపీ సీటుపై బ్రాహ్మణి కన్ను?