Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదు: శ్రీకాంత్‌రెడ్డి

Advertiesment
ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదు: శ్రీకాంత్‌రెడ్డి
, గురువారం, 27 ఫిబ్రవరి 2020 (07:54 IST)
తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ప్రజాచైతన్యయాత్రలో నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

ఉగాది రోజున ఇళ్లపట్టాల పంపిణీ కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తోందని చెప్పారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. సొంత నియోజకవర్గమైన కుప్పంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని విమర్శించారు.

ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడిపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్​రెడ్డి విమర్శలు గుప్పించారు. రాయలసీమ జిల్లాల్లో ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.

అవన్నీ దివంగత నేత రాజశేఖరరెడ్డి వల్ల వచ్చినవే అని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు చేసేదొకటి చెప్పేదొకటని ఎద్దేవాచేశారు.

తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో చరిత్ర సృష్టిస్తుంటే ఓర్వలేక అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. కంపెనీల పేర్లు చెప్పుకుని భూములు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు ఐదేళ్లలో తీసుకురాని పెట్టుబడులను తమ ప్రభుత్వం 9 నెలల్లో తీసుకొచ్చిందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరీక్ష సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయిస్తాం: విద్యాశాఖ మంత్రి