పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి కనిపించడం లేదు : చంద్రబాబు
ఇటీవల అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తనకు తప్పేమి కనిపించడం లేదని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
ఇటీవల అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తనకు తప్పేమి కనిపించడం లేదని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
తాజాగా జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలువురు మంత్రులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ... అనంతపురం సభలో పవన్ చేసిన వ్యాఖ్యల్లో తనకు తప్పేమీ కన్పించడం లేదన్నారు.
వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. సమస్యల నుంచి శక్తి వంచనలేకుండా ఈదుకొస్తున్నామని ఆయన చెప్పారు. సమస్యల్లో ఉన్న రాష్ట్రానికి ఏం ఇస్తున్నామో చెప్పడానికే కేంద్రానికి రెండున్నరేళ్లు పట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏమిస్తామో చెప్పడానికే రెండేళ్లుపడితే... ఆ నిధులివ్వడానికి మరో రెండున్నరేళ్లు తీసుకుంటే రాష్ట్రానికి ఉపయోగం ఏముందని, ఈ మాటలే పవన్ కళ్యాణ్ అన్నారని గుర్తుచేశారు. ఇందులో తనకు తప్పేమీ కనిపించడం లేదన్నారు. అవసరమైనప్పుడు రావాల్సిన నిధులు పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత వస్తే ఉపయోగం ఉండదన్నారు. సకాలంలో రాష్ట్రానికి నిధులు అందితేనే సమస్యలు పరిష్కరించగలమని ఆయన తెలిపారు.