ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడంతో సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
తొలుత టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. అసెంబ్లీకి నివాళులర్పించిన అనంతరం గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వెంటే ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత వరుసగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ప్రొటెం స్పీకర్ మిగిలిన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు.
అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నారా లోకేష్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, డోలా బాల వీరాంజనేయస్వామి, బీసీ జనార్ధన్ రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేశ్, ఎన్ఎండీ ఫరూక్ ప్రమాణం చేశారు.