Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉచిత ఇసుక విధానం.. తేడా జరిగితే అంతే సంగతులు.. బాబు స్ట్రాంగ్ వార్నింగ్

Chandra babu

సెల్వి

, బుధవారం, 16 అక్టోబరు 2024 (23:15 IST)
Chandra babu
సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉచిత ఇసుక విధానంపై వస్తున్న ఫిర్యాదులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇసుక పాలసీ లక్ష్యాలను ఉల్లంఘించకూడదని ఉద్ఘాటించారు. 
 
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నా.. ఇప్పటికీ ఇసుక కోసం పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై ఆయన కేబినెట్ మంత్రులపై సీరియస్ అయ్యారు. పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రజలు తమ ఇళ్లను నిర్మించుకునేందుకు ఉచితంగా ఇసుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, కొందరు దళారులు ఇసుకకు డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
 
ఉచిత ఇసుక విధానంలో మరోసారి ఇలాంటి తేడాలు కనిపిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. 10 రోజుల్లో అన్నీ సర్దుకోవాలని చెప్పారు. మరోసారి తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
ఉచిత ఇసుక విధానం అమలులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పూర్తి బాధ్యత వహించాలని ఇన్‌చార్జి మంత్రులను ఆదేశించారు. అనవసరమైన షరతులన్నీ తొలగించాలని, ఇసుక రవాణా, తవ్వకాలకు కనీస చార్జీలు మాత్రమే వర్తింపజేయాలని ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30 ఏళ్ల వయస్సులోనే ఆమెపై 12 కేసులు.. రూ.58.75 లక్షలు మోసం