Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పార్టీ మారి వ‌చ్చేవారికి ఈసారి టీడీపీలో ప‌ద‌వులుండ‌వు!

Advertiesment
chandra babu naidu
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 26 నవంబరు 2021 (18:06 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగు నేతలు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డిలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. మాజీ మంత్రి, ప్రస్తుత భాజపా నేత ఆదినారాయణరెడ్డికి నారాయణరెడ్డి సోదరుడు. 
 
 
తెలుగుదేశంలో చేరిక‌ల సందర్భంగా చంద్రబాబు, భూపేష్‌రెడ్డికి జమ్మలమడుగు బాధ్యతలు అప్పగించారు. జమ్మలమడుగు తెదేపాకు కంచుకోటని, జమ్మలమడుగులో పార్టీ కోసం పనిచేస్తున్న అందరికీ గుర్తింపు ఉంటుందని చంద్రబాబు తెలిపారు. జగన్‌రెడ్డి అన్నీ గాలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారు ఉంటారనే ఆనాడు అంబేడ్కర్‌ రాజ్యాంగం రాశారన్నారు. సీఎం గాల్లో వచ్చారు.. గాల్లోనే వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పెట్టి అప్పు తెచ్చుకుంటారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారు లేకపోతే తాకట్టు పెడుతున్నారు, సీఎంకు అనుభవం లేదు అహంభావం మాత్రం ఉందని విమర్శించారు. 
 
 
వలస పక్షులకు ఇక పార్టీలో అవకాశం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయడం లేదనేది రాసిపెడుతున్నానని, ఈసారి పనిచేసే వారికి మాత్రమే పార్టీలో పదవులని స్పష్టం చేశారు. పార్టీ మారి వచ్చే వాళ్లకు అవకాశం ఉండదని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్, పెయిడ్ ఆర్టిస్టుల పాద యాత్ర!