Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్నారుల సంఖ్య తగ్గిపోతుంది.. పెళ్ళిళ్లు చేసుకోండి బాబూ: ఏపీ సీఎం పిలుపు

పెళ్లిళ్లు చేసుకోకపోతే చిన్నారుల సంఖ్య తగ్గిపోయే పరిస్థితి వచ్చిందని, అందుకే పెళ్లి చేసుకుండి.. పిల్లలను కనండని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే సాంకేతికంగా అభివృద్ధి చెందితేనే ఆర్థికాభివృద్ధి

Advertiesment
Chandra babu naidu comments on marriage
, శనివారం, 19 నవంబరు 2016 (20:31 IST)
పెళ్లిళ్లు చేసుకోకపోతే చిన్నారుల సంఖ్య తగ్గిపోయే పరిస్థితి వచ్చిందని, అందుకే పెళ్లి చేసుకుండి.. పిల్లలను కనండని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే సాంకేతికంగా అభివృద్ధి చెందితేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని బాబు స్పష్టం చేశారు. కొందరు కులాలు మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని.. తనది ఒకటే కులం పేద కులమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
 
అప్పట్లో డ్వాక్రా సంఘాలను చూసి నవ్వారని, వారికి బుద్ధి వచ్చేలా మీరు ఎదిగారని డ్వాక్రా మహిళలను ఉద్దేశించి సీఎం అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మధ్యాహ్న భోజనం మీకే అప్పగించామని, 175 ఇండస్ట్రీయల్‌ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జన్‌ధన్‌ ఖాతాలున్నవారు రూపే కార్డులు తీసుకోవాలని చంద్రబాబు తెలిపారు. రూపే కార్డుల ద్వారా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని, ఆన్‌లైన్‌ లావాదేవీలు జరగాలని, మొబైల్‌ బ్యాంకింగ్‌ పెరగాలని చంద్రబాబు పేర్కొన్నారు. 
 
వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా ఉండాలని.. పేదలందరికీ పనిచేసేలా ఉండాలని.. అర్హులైన వారికి పనులు చేసి వారిని మెప్పించి.. టీడీపీకి ఓటేసేలా చేసుకోవాలని  చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. శనివారం రాజమహేంద్రవరంలో జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా కార్యకర్తల్ని గౌరవించే పార్టీ టీడీపీ అని అన్నారు. ప్రాంతీయపార్టీగా ఏర్పాటు చేసి ఎన్టీఆర్‌ టీడీపీని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలే టీడీపీకి శ్రీరామరక్ష అని.. 27 నెలల్లో రాష్ట్రంలో 12 వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు నిర్మించామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమించిన వ్యక్తిని భర్త ముందే పెళ్లాడిన వివాహిత.. బీహార్‌లో హుందాగా నడుచుకున్న గ్రామపెద్దలు..