Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జస్ట్.. ఎస్కేప్.. చంద్రబాబు సేఫ్.. తృటిలో తప్పిన ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండోసాన్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతుండగా, సెంట్రలైజ్‌డ్‌ ఏసీ సిలిండర్‌ పెద్ద శబ్దంతో ప

Advertiesment
Chandra babu escape accident
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (17:24 IST)
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండోసాన్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతుండగా, సెంట్రలైజ్‌డ్‌ ఏసీ సిలిండర్‌ పెద్ద శబ్దంతో పేలింది. పేలుడు శబ్దంతో చంద్రబాబు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఆయనను కమాండోలు, అధికారులు బయటికి తీసుకొచ్చారు. సిలిండర్ గ్యాస్ లీకై ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే.. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడపడితే అక్కడ ఏ చెత్తను పడితే ఆ చెత్తను పారవేసేవారు లేనప్పుడే దేశం నిజమైన అక్షరాస్యత సాధించినట్లు అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పారిశుద్ధ్య సాంకేతికాంశాలపై ఢిల్లీలో రెండు రోజుల సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పరిశుభ్రతపై దృష్టిలేకుండా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పారవేసే అక్షరాస్యులు, నిరక్షరాస్యుల బాధ్యతారహత ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేప్ చేసి జైలుకెల్లాడు.. జైలునుంచి విడుదలై మళ్లీ రేప్ చేసిన కామాంధుడు...