యాదవులపై ఉన్నంత ప్రేమ మరెవరీపైనా లేదు.. కౌగిలించుకుంటా: చాగంటి
ఈ సమాజంలో తనకు యాదవులపై ఉన్నంత ప్రేమ, ఆప్యాయతలు మరెవ్వరిపైనా లేవనీ, కావాలంటే యాదవులను కౌగిలించుకుంటానని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు వెల్లడించారు. అలాగే ఆ కులం వారిని గొల్లలు అనకు
ఈ సమాజంలో తనకు యాదవులపై ఉన్నంత ప్రేమ, ఆప్యాయతలు మరెవ్వరిపైనా లేవనీ, కావాలంటే యాదవులను కౌగిలించుకుంటానని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు వెల్లడించారు. అలాగే ఆ కులం వారిని గొల్లలు అనకుండా యాదవులు అని ఇకపై సంభోదిస్తానని యాదవ సంఘ ప్రతినిధులకు ఆయన హామీ ఇచ్చారు.
ఈ మధ్య చాగంటి తన ప్రవచనాల్లో యాదవులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. పలువురు యాదవ ప్రముఖులు కూడా చాగంటిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే యాదవ సంఘం సభ్యులు కొంతమంది చాగంటి కోటేశ్వరరావు ఇంటికి వెళ్లి వివరణ కోరారు. తన వ్యాఖ్యలపై యాదవ సంఘం సభ్యులకు చాగంటి క్లారిటీ ఇచ్చారు.
యాదవుల మీద తనకు పరమపూజ్య భావన ఉందని, తనకు అసలు యాదవులంటే ఉన్నంత ప్రీతి ఎవరిమీదా లేదని చాగంటి చెప్పారు. యాదవుల మీద తనకు ప్రేమ ఒక్కటే ఉందని, కావాలంటే యాదవులను కౌగిలించుకుంటానని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. ఏ ఛానెల్‌లో అయితే తన ప్రవచనాలను చూసి బాధపడుతున్నారో.. అదే ఛానెల్‌లో వివరణ కూడా ఇస్తానని చాగంటి పేర్కొన్నారు.