Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేంద్రంలో మళ్లీ మొదలైన ఏపీ షో.. వెంకయ్య చాంబర్లో 11 మంది మంత్రులు. మళ్లీ వాగ్దానాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై 15 మంది కేంద్ర మంత్రులతో వెంకయ్యనాయుడు శుక్రవారం ఢిల్లీలో సమీక్ష జరపటం సంచలనం గొలిపింది. ఏపీకి కేంద్రం నుంచి రావాలసిన పథకాలు, అమలు పర్చాల్సిన హామీల గు

కేంద్రంలో మళ్లీ మొదలైన ఏపీ షో.. వెంకయ్య చాంబర్లో 11 మంది మంత్రులు. మళ్లీ వాగ్దానాలు
హైదరాబాద్ , శనివారం, 11 మార్చి 2017 (06:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై 15 మంది కేంద్ర మంత్రులతో వెంకయ్యనాయుడు శుక్రవారం ఢిల్లీలో సమీక్ష జరపటం సంచలనం గొలిపింది. ఏపీకి కేంద్రం నుంచి రావాలసిన పథకాలు, అమలు పర్చాల్సిన హామీల గురించి చర్చించడానికి ఈ బేఠీ జరిగింది. ఏపీ విషయంలో పెండింగులో పడిన పలు అంశాల పరిపూర్తి లక్ష్యంగా 11 మంది కేంద్ర మంత్రులను పార్లమెంటులోని తన చాంబర్‌కు ఆహ్వానించి వెంకయ్య చర్చించారు. టీడీపీ, బీజేపీ ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. ఏపీకి సంబంధించిన అనేక అంశాలపై 15మంది మంత్రులతో వెంకయ్య శుక్రవారం ఢిల్లీలో సమీక్షించారు.రాష్ట్రానికి ఇప్పటికే మంజూరైన పథకాల కింద తగినన్ని నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేయాలని, తద్వారా ఆయా పథకాల సత్వర అమలుకు సహకరించాలని కేంద్ర మంత్రులను వెంకయ్య కోరారు. 
 
మొదటగా ఐఎన్ఎస్ విరాట్‌ను ఆంధ్రకు ఇవ్వడం, పర్యాటక ఆకర్షణగా దానిని అభివృద్ధి చేయడంపై రక్షణ శాఖ మంత్రితో పర్రీకర్‌తో వెంకయ్య మాట్లాడారు. కృష్ణా జిల్లా నాగాయలంకలో డీఆర్‌డీవో క్షిపణి పరీక్ష కేంద్రం, చిత్తూరు జిల్లా కొక్కిరాలకొండలో రక్షణ బృందాలకు శిక్షణ కేంద్రం, బొబ్బిలిలో నావల్‌ ఎయిర్‌ స్టేషన, కర్నూలులో నేషనల్‌ ఓపెన ఎయిర్‌ రేంజ్‌ కేంద్రం ఏర్పాటుపై చర్చించారు. విశాఖపట్నంలో రైల్వే జోన ఏర్పాటు అంశం తుది దశలో ఉందని సురేశ ప్రభు తెలిపారు. నడికూడి-శ్రీకాళహస్తి సహా పలు పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులపైనా చర్చించారు. ఆంధ్రలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరిజన యూనివర్సిటీల ఏర్పాటుపై కేబినెట్‌ ప్రతిపాదన సిద్ధమవుతోందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన విశ్వవిద్యాలయం ఏర్పాటును పరిశీలించాలని వెంకయ్య సూచించారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తే అమరావతిలో పవర్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేసేందుకు విద్యుత శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అంగీకరించారు. విశాఖ జిల్లా పూడిమడకలోని ఏపీ జెన్‌కో-ఎన్టీపీసీ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు అదనపు బొగ్గు గనుల కేటాయింపు, రాష్ట్రంలో గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుపైనా మాట్లాడారు. 
 
పోలవరం ప్రాజెక్టు పరిధిలోని గ్రామస్తుల పుసరావాసానికి వేగంగా చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి వెంకయ్య సూచించారు. విశాఖపట్నం సమీపంలోని పూడి టెక్నికల్‌ టూల్‌ సెంటర్‌ ప్రాజెక్టును వేగంగా అమలు చేయాలని, ఏపీలో ఎనఎ్‌సఐసీ కేంద్రాన్ని, టెక్నాలజీ ఇంక్యుబేషన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్‌రాజ్‌ మిశ్రాకు వెంకయ్య సూచించారు. విశాఖ, విజయవాడల్లో టెక్నాలజీ సెంటర్లను, అమరావతిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఎనఎ్‌సఐసీ సుముఖంగా ఉందని మిశ్రా తెలిపారు. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం 80-90 వేల చదరపు అడుగుల భవనాన్ని, 9 ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వాలని కోరారు. స్వదేశ దర్శన సహా పలు పథకాలను, పర్యాటక సర్క్యూట్లను త్వరగా అమలు చేయాలని పర్యాటక శాఖ మంత్రి మహేశ శర్మకు వెంకయ్య సూచించారు.
 
మంగళగిరిలో ఎయిమ్స్‌ ఏర్పాటును వేగవంతం చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను వెంకయ్య కోరారు. అక్కడ భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం వాటిని త్వరగా పరిష్కరిస్తే నిర్మాణాన్ని త్వరితగతిన చేపడతామని నడ్డా హామీ ఇచ్చారు. ఆంధ్రలో 380 మెడికల్‌ పీజీ సీట్లను పెంచాలని కోరగా.. సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపారు. ఈ అంశంపై ఆరోగ్య శాఖ కార్యదర్శి సీకే మిశ్రాతో కూడా వెంకయ్య మాట్లాడారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివా్‌సకు ఫోన చేసి నడ్డాతో మాట్లాడించారు. వచ్చేవారం ఢిల్లీకి రావాలని కామినేనికి కేంద్ర మంత్రి సూచించారు. 
 
విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటును వేగవంతం చేయాలని, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం నౌకాశ్రయాల్లో మాంసం ఎగుమతి సమస్యను పరిష్కరించాలని, కాకినాడలో ఇండియన ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ ఏర్పాటును వేగవంతం చేయాలని వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. వీటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. విజయవాడ మెట్రో పురోగతిపై పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శితో వెంకయ్య సమీక్ష జరిపారు. పబ్లిక్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బోర్డు వద్ద ఈ ప్రాజెక్టు పరిశీలనలో ఉందని, ఈనెల 20వ తేదీన బోర్డు సమావేశంలో దీనికి ఆమోదం లభించవచ్చని అధికారులు తెలిపారు.
 
రాష్ట్రానికి ఇప్పటికే మంజూరైన పథకాల కింద తగినన్ని నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేయాలని, తద్వారా ఆయా పథకాల సత్వర అమలుకు సహకరించాలని కేంద్ర మంత్రులను వెంకయ్య కోరారు. తన చాంబర్‌కు వచ్చి ఈ అంశాలపై సావధానంగా విన్నందుకు, చర్చించినందుకు, సానుకూలంగా స్పందించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
 
ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏపీకి సంబంధించిన ప్రతి పథకం విషయంలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతోందని అడిగితే సమాధానం చెప్పే నేత లేకపోవడం విషాదం. మళ్లీ ఈ బృహత్ సమావేశం, చర్చలు కూడా షో బిజినెస్‌లాగే ముగిసిపోతాయా అనే సందేహం బలపడుతోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వదల బొమ్మాళీ అంటున్న నోట్ల రద్దు భూతం.. ఖాళీ ఏటీఎంలతో బేర్‌మంటున్న జనం..