పెద్ద నోట్ల రద్దు.. కోపంతో రెండు ఏటీఎంలను ధ్వంసం చేసిన కానిస్టేబుల్..
పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కోపంతో ఉన్నారు. అల్లర్లు జరుగవచ్చునని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో నగదు రాలేదన్న కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్ రెండు
పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కోపంతో ఉన్నారు. అల్లర్లు జరుగవచ్చునని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో నగదు రాలేదన్న కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్ రెండు ఏటీఎంలను ధ్వంసం చేసిన ఘటన శుక్రవారం రాత్రి విశాఖ జిల్లా పాడేరులో చోటుచేసుకుంది. పాడేరులో ప్రజలు డబ్బులు తీసుకోవడానికి ఒకే స్టేట్ బ్యాంక్ ఏటీఎం మాత్రమే ఉంది.
రాత్రి డబ్బులు తీసుకోవడానికి ఆ ఏటీఎం వద్దకు వచ్చిన కానిస్టేబుల్ కొద్దిసేపు వరుసలో నిలబడ్డాడు. అతని వంతు వచ్చే సరికి ఏటీఎమ్ మిషీన్ పనిచేయలేదు. దీంతో కానిస్టేబుల్‌కి పట్టలేని కోపం వచ్చింది.
అంతే కోపాన్ని ఏ మాత్రం ఆపుకోలేక ఏటీఎం మిషీన్‌ను నాలుగైదు సార్లు కాలితో తన్నాడు. అయినా కోపం ఏమాత్రం తగ్గకపోవడంతో మళ్లీ యంత్రాన్ని ధ్వంసం చేశాడు. దీంతో ఆ రెండు ఏటీఎంలూ ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పాడేరు బ్యాంకు సిబ్బంది ఏటీఎం కేంద్రానికి తాళం వేశారు.