ఓట్ల కోసం సరిహద్దులో సైనికులను త్యాగాలను కూడా మోడీ వాడుకోవడం సిగ్గు చేటని సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ ధ్వజమెత్తారు. ఎఐటీయుసి దినోత్సవాల సంధర్భంగా తిరుపతిలో జరిగిన బహిరంగసభలో సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ మాట్లాడారు.
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు సిబిఐ పెంపుడు జంతువులా మారిందని విమర్సించారు. ప్రభుత్వం ఉసిగొల్పిన వారిపై కేసులు పెట్టేందుకు సిబిఐ సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. దేశంలోని సంపద మొత్తం కొందు వ్యక్తుల కోసం దోచి పెడుతున్నారని విమర్సించారు.
అలాగే కార్మికులు దేశానికి సంపద సృష్టికర్తలు అని మోడీ గుర్తించాలన్నారు. వీధి విక్రయదారులకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి బ్యాంకు ద్వారా ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దోపిడీ వ్యవస్థ ఉన్నంత కాలం కమ్యూనిస్టుల పోరాటాలు ఆగవు అన్నారు నారాయణ.