Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జ‌గ‌న‌న్న పాల వెల్లువ‌... బల్కు మిల్కు కూలింగ్ యూనిట్లు ఏర్పాటు

జ‌గ‌న‌న్న పాల వెల్లువ‌... బల్కు మిల్కు కూలింగ్ యూనిట్లు ఏర్పాటు
విజ‌య‌వాడ‌ , బుధవారం, 27 అక్టోబరు 2021 (10:02 IST)
జగనన్న పాలవెల్లువ కింద జిల్లాలో పాలసేకరణ జరిగే గ్రామాలతో పాటు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ (బామ్ సి యు) లను మ్యాపింగ్ చేయాల‌ని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పశుసంవర్దక అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశమందిరంలో జాయింట్ కలెక్టర్ మాధ‌వీలతతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిడిలు, ఎడీలు హాజరయ్యారు. 

 
కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ, జిల్లాలో పాలసేకరణ కేంద్రాలు ప్రతి రూట్ కు 11గా గుర్తించారన్నారు. సగటు పాలసేకరణ ప్రతి రూట్లలో 1433 లీ అంచనా వేస్తున్నారు. పాలసేకరణ జరిగే గ్రామం నుండి ప్రొక్యూర్మెంట్ పాయింట్ వరకూ సగటున 46 కిమీ దూరం ఉంటుందని అంచనా వేస్తున్నారు.  గ్రామాల్లో ఎక్కడ పాలు  ఎక్కువగా సేకరించే గ్రామాలుంటాయో ఆ గ్రామాల్లో బియంసియూ ఏర్పాటు చేయమని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 
 
 
గ్రామాల్లో ఆటోమేటిక్ మిల్కు (ఎయం సియు) యూనిట్ లను ఏర్పాటు చెయ్యాల‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.  ఎయంసియూ నిర్వహించే రైతులకు ప్రత్యేక అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. సేకరించే పాల నాణ్యత ప్రమాణాలు చూసుకుని అమ్మకందారునికి సరైన డబ్బు కూడాచెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రతి గ్రామంలో పాలు సేకరించి ప్రొక్యూర్ మెంట్ పాయింట్ వరకు చేరేందుకు దాదాపు 3 గంటలు పడుతుందన్నారు. జిల్లాలో ప్రాథమికంగా 717 బియంసియూ లను గుర్తించామన్నారు. అవసరమైన మ్యాపింగ్ పూర్తి చేస్తే, ఆ సంఖ్య మరికొంత తగ్గించవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
 
జాయింట్ కలెక్టర్ డా. మాదవీలత మాట్లాడుతూ, పాల సేకరణ రూట్,  వాటి క్లష్టర్లను గుర్తించడంద్వారానే జగనన్న పాల వెల్లువ పధకం విజయవంతం అవుతుందని అన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి గ్రామాలను గుర్తించి బల్బు మిల్కు యూనిట్లను సిఫారస్ చేయమని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ విద్యాసాగర్, డిడిలు గోపీచంద్, రత్నశ్రీ, ఉమా, వెంకటేశ్వరరావు, డా. చంద్రశేఖరరావు తదితరులు ‌పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రస్ట్ స్వాధీనం కోసం ధూళిపాళ్ళ నరేంద్రకు సర్కారు నోటీసులు