Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీకి రిక్త హస్తం.. రాజధాని నిర్మాణానికి నిధులు సున్నా... విభజన హామీల ఊసెత్తని జైట్లీ

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మొండిచేయి చూపించారు. రాజధాని నిర్మాణానికి ఒక్క పైసా నిధులను కూడా కేటాయించలేదు. పైపెచ్చు... విభజన చట్టంలోని పేర్కొన్న హామీలను ఆయన పూర

Advertiesment
Budget 2017
, గురువారం, 2 ఫిబ్రవరి 2017 (08:29 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మొండిచేయి చూపించారు. రాజధాని నిర్మాణానికి ఒక్క పైసా నిధులను కూడా కేటాయించలేదు. పైపెచ్చు... విభజన చట్టంలోని పేర్కొన్న హామీలను ఆయన పూర్తిగా విస్మరించారు. వెరసి బుధవారం లోక్‌సభలో జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం చేశారన ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 
 
రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు పూర్తిగా సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. నిధులు మాత్రం ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారు. ఈ బడ్జెట్‌లో రాజధాని నిర్మాణం ఊసే లేకుండా జాగ్రత్తపడ్డారు. రాష్ట్ర ప్రజలు దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న విశాఖ రైల్వే జోన్‌ ఊసూ లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావనే కనిపించలేదు. 
 
రాష్ట్ర విభజన అనంతరం భారీ రెవెన్యూ లోటులో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఎలాంటి ఊరట కలిగించలేదు. అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం. ఇక రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీల ప్రస్తావన అసలే లేదు. 
 
విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంట్, విశాఖలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్, విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేయడం, రెవెన్యూ లోటు భర్తీ వంటి ముఖ్యమైన హామీలను సైతం ఈ బడ్జెట్‌లో విస్మరించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల ఏర్పాటుకు నిర్దిష్ట కేటాయింపులు జరపలేదు. మిగిలిన మెట్రోల్లో కలిపి కేటాయింపులు చూపారు. బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగినా అధికార టీడీపీ ఎంపీలు ఒక్కరు కూడా నిరసన తెలిపిన దాఖలాలు లేవు. పైపెచ్చు బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రశంసిస్తూ బల్లలు చరచడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జైట్లీ దెబ్బకు ఏపీ డమాల్ : టీడీపీ ఎంపీలు చప్పట్లే చప్పట్లు.. తోడుగా బాబు దరహాసం