అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాక నేపథ్యంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి జగన్కు ఆహ్వానం అందకపోవటంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.
ప్రతిపక్షాలు దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. సీఎం జగన్ దేశంలో బలమైన నాయకుడు కాబట్టే విందుకు ఆహ్వానించలేదని అన్నారు.
నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ వంటి వారిని కూడా ఈ కార్యక్రమానికి పిలవలేదని గుర్తు చేశారు. విశాఖలో బలవంతంగా భూసేకరణ చేయడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
అలాగే ఏం చేశారని విజయనగరం జిల్లాలో పర్యటిస్తారో చంద్రబాబు చెప్పాలని విమర్శించారు. జిల్లాలో చైతన్య యాత్ర పేరిట యాత్రలు చేసే ముందు చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు.
విశాఖలో భూసేకరణ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. బలవంతంగా ఎవరి నుంచీ భూమిని సేకరించేది లేదని చెప్పారు. అవసరమైతే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చే భూసమీకరణ చేయాలని సీఎం చెప్పారని గుర్తు చేశారు.