Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌పై అలిగిన బొత్స సత్తిబాబు.. వైకాపాకు గుడ్‌బై? నిజమేనా?

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చిన బొత్స స‌త్యానారాయ‌ణ గత కొన్నిరోజుల నుంచి క‌నిపించ‌డం లేదు. పొలిటిక‌ల్ స్కీన్‌పై నుంచి అసలు కనిపించడంమానేశాడు. అస‌లు ఆయ‌న ప్రెస్‌మీట్లు కూడా పెట్టడ

జగన్‌పై అలిగిన బొత్స సత్తిబాబు.. వైకాపాకు గుడ్‌బై? నిజమేనా?
, గురువారం, 9 మార్చి 2017 (12:45 IST)
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చిన బొత్స స‌త్యానారాయ‌ణ గత కొన్నిరోజుల నుంచి క‌నిపించ‌డం లేదు. పొలిటిక‌ల్ స్కీన్‌పై నుంచి అసలు కనిపించడంమానేశాడు. అస‌లు ఆయ‌న ప్రెస్‌మీట్లు కూడా పెట్టడం లేదు. ఆయ‌న ఎక్కడ ఉన్నాడో అసలు ఎవరికీ తెలియడం లేదట. విజ‌య‌వాడ ద‌గ్గ‌ర జ‌రిగిన బ‌స్సు ప్రమాదంతో బాధితుల ప‌రామ‌ర్శ‌కు జ‌గ‌న్ వెళ్లారు. జేసీ బ్ర‌ద‌ర్స్ టార్గెట్‌గా వారిపై విరుచుకుప‌డ్డారు. క‌లెక్ట‌ర్ గొడ‌వ‌తో అదో పెద్ద గొడవైంది. జ‌గ‌న్‌ ఎప్పుడైనా విమర్శలు చేస్తే ఆయన వెన్నంటే బొత్స కూడా ఉండేవాడు. కానీ ప్రస్తుతం బొత్స సైలెంట్‌గా ఉండడానికి కారణాలేమైనా ఉన్నాయన్న కోణంలో వైసిపి నేతలు ఆలోచిస్తున్నారు. 
 
ఒకప్పుడు వైకాపాలో జగన్ తర్వాత ఆ స్థాయిలో బొత్స సత్యనారాయణ విమర్శలు చేసేవారు. ఎప్పుడూ పార్టీ గురించి మాట్లాడినా వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి చెడామడా తిట్టేసేవాడు. కానీ ఇప్పుడు ఆ పోస్టును అంబటి రాంబాబు తీసుకున్నారు. బొత్స కొన్నిరోజులుగా క‌నిపించ‌క‌పోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆయ‌న సీటు ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే బొత్స అలిగార‌ని కొంత ప్ర‌చారం న‌డుస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో గంగుల ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆళ్ల‌నానిని జ‌గ‌న్ ఎంపిక చేశారు. దీంతో బొత్స అలిగాడంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 
 
పార్టీలో సీనియర్ నేతగా ఎదగడమే కాకుండా పార్టీ కోసం పనిచేసిన తనకు తీవ్ర అవమానం జరిగిందన్న ఆలోచనలో బొత్స ఉన్నారట. అందుకే బొత్స సత్యనారాయణ పార్టీ అధినేత జగన్ స్వయంగా పిలిచినా పట్టించుకోవడం లేదట. అయితే ఆయన సన్నిహితులు మాత్రం పార్టీ మారిపోతారని చెబుతున్నారు. మొత్తం మీద బొత్స విషయం ప్రస్తుతం వైసిపిలోనే హాట్ టాపిక్‌గా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11న మాజీ సీఎం కిరణ్‌ హైదరాబాద్‌కు.. అనుచరులతో భేటీ...?