హైదరాబాదే ఏపీకి రాజధాని అంటూ కొత్త చర్చకు తెర లేపారు మంత్రి బొత్స. 2024 వరకు హైదరాబాదే ఏపీకి రాజధాని అంటూ ప్రస్తావించారు.
సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేసే అంశంపై మాత్రమే కోర్టు వ్యాఖ్యానించిందని.. శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రధానమైన సూచన వికేంద్రీకరణ అన్నారు.
2024 వరకు రాజధాని హైదరాబాద్ మాత్రమే అన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానం ప్రకారం అమరావతి శాసన రాజధాని మాత్రమేనని చెప్పారు.
ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రసంగించారని.. రూ. 1.32 లక్షల కోట్లను డీబీటి ద్వారా అందించే అంశంపై మాట్లాడారని ఆయన వెల్లడించారు.
ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంది కాని టీడీపీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోడానికి ప్రయత్నం చేశారు దురదృష్టకరమన్నారు.