Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్యాకేజీ వద్దంటున్న చంద్రబాబుకి మనమే కటీఫ్ చెపుదామా? బీజేపీ నేతల అంతర్మథనం

ఏపీకి కేంద్రం కేటాయించిన ప్రత్యేక ప్యాకేజీపై టీడీపీ అధితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు.. పలువురు పెదవి విరుస్తూనే... స్వాగతించారు. అదేసమయంలో విపక్షాలు మాత్రం ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేస్తు

ప్యాకేజీ వద్దంటున్న చంద్రబాబుకి మనమే కటీఫ్ చెపుదామా? బీజేపీ నేతల అంతర్మథనం
, బుధవారం, 14 సెప్టెంబరు 2016 (11:41 IST)
ఏపీకి కేంద్రం కేటాయించిన ప్రత్యేక ప్యాకేజీపై టీడీపీ అధితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు.. పలువురు పెదవి విరుస్తూనే... స్వాగతించారు. అదేసమయంలో విపక్షాలు మాత్రం ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు గుస్సగా ఉన్నారు. ఓ పథకం ప్రకారం తమను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నదని బీజేపీ నేతలు అనుమానాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. 
 
మరో రెండేళ్ల తర్వాత ఎన్నికలు జరిగే ముందు చంద్రబాబు, బీజేపీని విమర్శిస్తూ, కటీఫ్ చెబుతారని, అది జరిగే ముందే బీజేపీయే తెగతెంపులు చేసుకుంటే సంస్థాగతంగా ఎదగవచ్చని పలువురు బీజేపీ నేతలు అధిష్టానం పెద్దల ముందు వ్యాఖ్యానించినట్టు సమాచారం.
 
ఇటీవల బీజేపీ జిల్లా పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లతో గతవారంలో కేంద్రం నుంచి వచ్చిన అరుణ్ సింగ్, సిద్ధార్థ నాథ్ సింగ్‌లు సమావేశమైన వేళ, బీజేపీయే ముందుగా స్పందించి తెలుగుదేశంతో విడిపోతే వచ్చే లాభనష్టాలపై రాష్ట్ర నేత కందుల రాజమోహన్ రెడ్డి చేసిన ప్రసంగం, రాజకీయ విశ్లేషణ అందరినీ ఆకర్షించిందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కావేరీ జలాల వివాదంపై ప్రధాని మోడీ, వెంకయ్య ఏమన్నారో తెలుసా?