రామమందిరాన్ని అడ్డుకునేవారి తలలు తెగనరుకుతా: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే వారి తలలు తెగనరుకుతా అంటూ హైదరాబాద్, గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన శోభాయాత్ర సందర్భంగా ఆయన చేసిన వ
అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే వారి తలలు తెగనరుకుతా అంటూ హైదరాబాద్, గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన శోభాయాత్ర సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
మందిరం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా.. ప్రాణాలు తియ్యడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. 'రామ మందిరం నిర్మిస్తే తీవ్ర పరిస్థితులుంటాయంటున్న వారికోసం ఎదురు చూస్తున్నాం. మళ్లీ అలాంటి వ్యాఖ్యలు చేస్తే తలనరుకుతాం' అని హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో రాజాసింగ్‌పై డబ్బీర్‌పుర పోలీసు స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది. రాజాసింగ్ మాటలు ఓ వర్గానికి కించ పరిచే విధంగా ఉన్నాయని పాతబస్తీకి చెందిన అహ్మదుల్లాఖాన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజాసింగ్ మాటలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది.