రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి చేశారట... అందుకే తితిదే ఈవోగా అనిల్ సింఘాల్ : భానుప్రకాష్ కామెంట్స్
భారత రాష్ట్రపతిగా దక్షిణాదికి చెందిన నీలం సంజీవరెడ్డి నియమితులయ్యారనీ, అలాగే, తిరుమల తిరుపతి దేవస్థాన ఈవోగా ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారని రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు గుర్
భారత రాష్ట్రపతిగా దక్షిణాదికి చెందిన నీలం సంజీవరెడ్డి నియమితులయ్యారనీ, అలాగే, తిరుమల తిరుపతి దేవస్థాన ఈవోగా ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారని రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
తితిదే ఈవోగా బీహార్ రాష్ట్రానికి చెందిన ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియమితులైన విషయం తెల్సిందే. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. అలాగే, విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపనంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో తితిదే ఈవో అంశం వివాదస్పదమైంది.
ఈనేపథ్యంలో బీజేపీ నేత భానుప్రకాష్ స్పందిస్తూ నిబంధనల మేరకే తితిదే ఈవోగా సింఘాల్‌ను నియమించారని, పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని ఈవోగా నియమించినట్టు రాద్ధాంతం చేయడం పవన్‌కు తగదని హితవు పలికారు. భారత రాష్ట్రపతిగా గతంలో నీలం సంజీవరెడ్డి ఎన్నికయ్యారని... అలాంటప్పుడు టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన వ్యక్తిని నియమిస్తే తప్పేంటని ప్రశ్నించారు.