Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం కులపతిగా ముఖ్యమంత్రి జగన్!!!

jagan

ఠాగూర్

, గురువారం, 8 ఫిబ్రవరి 2024 (08:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం కులపతిగా ముఖ్యమంత్రి వ్యవహరించేలా చట్ట సవరణ చేసింది. ఈ బిల్లును ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా దానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సాధారణంగా విశ్వవిద్యాలయాలకు ఆయా రాష్ట్రాల గవర్నర్లే వీసీలుగా ఉంటారు. కానీ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం సాగుతుంది. దీంతో అన్ని వర్శిటీలకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులే చాన్సలర్లుగా ఉండేలా చట్టానికి సవరణలు చేశారు. ఏపీలో ట్రిపుల్ ఐటీల కోసం ఈ రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక యూనివర్శిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఇకపై ఈ యూనివర్శిటీకి వీసీగా జగన్మోహన్ రెడ్డి కొనసాగనున్నారు. 
 
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2024 జాబ్ క్యాలెండర్ ఇదే ...
 
భారతీయ రైల్వే ఈ యేడాది అనేక కీలక పోటీ పరీక్షలను నిర్వహించనుంది. ఇందుకోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) షెడ్యూల్‌తో కూడిన వార్షిక జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌లో భాగంగా, ఏప్రిల్ - జూన్ నెలల మధ్య ఆర్ఆర్బీ టెక్నీషియన్స్ పరీక్ష నిర్వహించనుంది. ఇందులోదాదాపు 9 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేయనుంది. అలాగే, జూలై - సెప్టెంబరు మధ్యకాలంలో గ్రూపు-డి పోస్టులను భర్తీ చేయనుంది. 
 
అన్ని ప్రాంతీయ అధికారిక వెబ్‌సైట్లలో ఉంచిన ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం... రాబోయే నోటిఫికేషన్లు, పరీక్ష షెడ్యూల్ ఈ క్యాలెండర్‌లో ఉన్నాయి. నాన్-గ్రాడ్యుయేట్ పాపులర్ కేటగిరీలైన గ్రాడ్యుయేట్ (4, 5, 6 లెవల్స్), అండర్ గ్రాడ్యుయేట్ (లెవెల్స్ 2, 3) పోస్టులు, జూనియర్ ఇంజనీర్లు, పారామెడికల్ రెండింటికీ సాంకేతికేతర ప్రసిద్ధ కేటగిరీలతో సహా వివిధ వర్గాల కోసం పరీక్షల షెడ్యూల్ ఉంటుంది. కేటగిరీలు, గ్రూప్-డీ స్థాయి, మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీలకు సంబంధించిన జాబ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. వీటితో పాటు 5,696 అసిస్టెంట్ లోకో పైలట్, 9,000 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేసేందుకు క్యాలెండర్ ద్వారా తెలిపింది. ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైన రైల్వే వార్షిక క్యాలెండర్‌ను ఆర్ఆర్బీ అధికారికంగా అందుబాటులో ఉంచింది.
 
వార్షిక క్యాలెండర్ ప్రకారం టెక్నీషియన్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ - జూన్ మధ్య పరీక్ష షెడ్యూల్ నిర్ణయించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్ఆర్‌బీ ఏఎల్పీ రిక్రూట్‌మెంట్ సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 19లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎన్‌టీపీసీ (గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్), జూనియర్ ఇంజనీర్స్ (జేఈ), పారామెడికల్ కేటగిరీలు, గ్రూప్-డీతో పాటు పలు కేటగిరీల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జులై - సెప్టెంబర్ నెలల మధ్య జారీ కానుంది. ఇక మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల నోటిఫికేషన్ అక్టోబర్ - డిసెంబర్ 2024 మధ్య విడుదలవనుంది.
 
ఆర్ఆర్బీ విడుదల చేయనున్న నోటిఫికేషన్ విడుదల తేదీలను పరిశీలిస్తే, 
ఆర్ఆర్బీ ఏఎల్పీ జనవరి 20, 2024 (5,696 ఖాళీలు)
ఆర్ఆర్బీ టెక్నీషియన్స్ - ఏప్రిల్ - జూన్ 2024 (9,000 ఖాళీలు)
గ్రాడ్యుయేట్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2024 (లెవల్ 4, 5, 6) - జులై-సెప్టెంబర్ మధ్య విడుదల
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2024 అండర్ గ్రాడ్యుయేట్ (లెవల్ 2, 3)- జులై-సెప్టెంబర్ మధ్య విడుదల
ఆర్ఆర్డీ జేఈ రిక్రూట్మెంట్ 2024 జులై-సెప్టెంబర్ మధ్య నోటిఫికేషన్ విడుదల
ఆర్ఆర్బీ పారామెడికల్ రిక్రూట్మెంట్ 2024- జులై-సెప్టెంబర్ మధ్య విడుదల
ఆర్ఆర్బి గ్రూప్ డీ రిక్రూట్మెంట్ 2024- జులై-సెప్టెంబర్ విడుదల
ఆర్ఆర్బీ ఎంఐ రిక్రూట్మెంట్ 2024 - అక్టోబర్ - డిసెంబర్ మధ్య నోటిఫికేషన్ విడుదల. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని పోలిన విష్ణు విగ్రహం లభ్యం.. ఎక్కడ?