అన్ని వ్యాపారాలు ఢమాల్.... గ్రౌండ్ రియాలిటీ మీకు తెలుసా మోడీజీ
అమరావతి : పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు రాత్రికిరాత్రి ప్రధాని మోడీ ప్రకటించేశారు. రద్దు చేసిన నోట్ల స్థానే 2 వేల నోట్లు, 500 నోట్లు యుద్ధ ప్రాతిపదికన పంపుతున్నారు. బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. చిల్లర సమస్యతో అల్లాడ
అమరావతి : పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు రాత్రికిరాత్రి ప్రధాని మోడీ ప్రకటించేశారు. రద్దు చేసిన నోట్ల స్థానే 2 వేల నోట్లు, 500 నోట్లు యుద్ధ ప్రాతిపదికన పంపుతున్నారు. బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. చిల్లర సమస్యతో అల్లాడుతున్నారు. ఇదంతా మీడియా ద్వారా, పత్రికల ద్వారా అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ, అంతకుమించి గ్రౌండ్ రియాలిటీని చూస్తున్నవారు చాలా తక్కువమంది.
నిజంగా అసలు పెద్ద నోట్ల వల్ల ఎలాంటి దుష్పరిణామాలు నెలకొంటున్నాయో మీకు తెలుసా... నల్ల ధనం అరికట్టే క్రమంలో అసలు ధనమే మార్కెట్లోకి రావడం తగ్గిపోయింది. ఎక్కడా వ్యాపారాలు లేవు. అమ్మేవాడున్నా... కొనేవాడు లేడు. మార్కెట్లన్నీ డల్ అయిపోయాయి. రియల్ ఎస్టేట్ జీరోకి వెళ్లిపోతోంది. ఎక్కడా బిజినెస్ లేదు. మరో పక్క నిర్మాణ రంగం కూడా కుదేలయిపోతోంది. దీనితో కార్మికులంతా పనులు లేక అల్లాడే పరిస్థితి తలెత్తుతోంది.
మీరు చూస్తున్న ఈ కార్ వాష్... రాజమండ్రిలోది. ఈ కార్ వాష్‌కు ఏదైనా కారు సర్వీసింగ్‌కి రావాలంటే, ఫోన్ చేసి టైమ్ తీసుకుని రావాలి. అంత రద్దీగా వుండేది ఈ కార్ వాష్ పాయింట్. కానీ ఇపుడు ఇదిగో ఇలా ఖాళీగా అయిపోయింది. ఓనర్ల చేతిలో క్యాష్ లేదు...పాయింట్ కి ఆదాయం లేదు...పనివాళ్ళకు టిప్పులు లేవు. ఇలాంటి సెమీ స్కిల్డ్ / అన్ స్కిల్డ్ పనివారికి జీతాలు నామమాత్రం... టిప్పులే జీవనాధారం. ఇపుడు రెండూ లేవు. కారు పాయింటు ఓనర్ ఓకే, నాలుగు రోజులు గిరాకీ లేకున్నా ఎలాగోలా గడిపేస్తాడు. జేబులో డబ్బు లేక కారు కడిగించుకునే వాళ్ళు వాయిదా వేసుకున్నారు. ఇక్కడ పని చేసేవాళ్ళే కటకటలాడిపోతున్నారు. వాడకానికి 100 రూపాయలు అడిగితే సీనియర్లకి యాభై, మిగిలిన వాళ్ళకి పదీ, ఇరవై కూడా కష్టంగానే ఇస్తున్నారు. ఈ కార్ వాష్ పాయింట్ లో పని చేస్తున్న 14 మంది వారం రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీని శాపనార్ధాలు పెడుతున్నారు.
కొనుగోలు శక్తిలో మెట్రోలు, రాజధానులు మినహా దేశంలోనే 9 వ స్ధానంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో వాణిజ్య కేంద్రమైన రాజమహేంద్రవరంలో ఇదీ దుస్తితి... ఈ లెక్కన మోదీ సృష్టించిన మాంద్యం ప్రభావం ఇతర ప్రాంతాల్లో, దేశంలో ఎంతగా విస్తరిస్తోందో అంచనా వేయవచ్చు! ఈ పరిస్థితిని గమనించి, ఇకనైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.