Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డిని విచారిస్తున్న సిఐడి... తుని రైలు ద‌హ‌నంపై దొరికిపోయారా?

గుంటూరు: వైసీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే భూమన క‌రుణాక‌ర్ రెడ్డిని సిఐడి పోలీసులు సీరియ‌స్‌గా విచారిస్తున్నారు. ర‌త్నాచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌ని తునిలో ద‌హ‌నం చేసిన కేసులో ఈ విచార‌ణ కొనసాగుతోంది. తుని విధ్వంసానికి సంబంధించి పలు అంశాల పై భూమన కరుణాకరరెడ్డిని సీ

భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డిని విచారిస్తున్న సిఐడి... తుని రైలు ద‌హ‌నంపై దొరికిపోయారా?
, మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (19:16 IST)
గుంటూరు:  వైసీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే భూమన క‌రుణాక‌ర్ రెడ్డిని సిఐడి పోలీసులు సీరియ‌స్‌గా విచారిస్తున్నారు. ర‌త్నాచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌ని తునిలో ద‌హ‌నం చేసిన కేసులో ఈ విచార‌ణ కొనసాగుతోంది. తుని విధ్వంసానికి సంబంధించి పలు అంశాల పై భూమన కరుణాకరరెడ్డిని  సీఐడీ ప్ర‌శ్నిస్తున్న‌ట్లు స‌మాచారం. కాపు ఉద్య‌మంలో భాగంగా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తుని రైల్వే స్టేష‌న్లో రైలు రోకో నిర్వ‌హిస్తుండ‌గా, కొంద‌రు విధ్వంస‌కారులు ర‌త్నాచ‌ల్ బోగీల‌ను త‌గుల‌బెట్టారు. 
 
ఈ సంఘ‌ట‌న వెనుక వైసీపీ నేత‌ల హ‌స్తం ఉంద‌ని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై భూమనను సీఐడీ ఏఎస్పీ హరిక్రిష్ణ గుంటూరులోని త‌న కార్యాల‌యంలో ప్ర‌శ్నిస్తున్నారు. తుని ఘటనకు ముందు భూమన కాల్ డేటా పైన ఆరా తీశారు. భూమ‌న‌ను విచారిస్తున్న స‌మ‌యంలో  సీఐడీ కార్యాలయం ముందు గుమిగూడిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి వ‌ర్గీయుల‌ను బ‌య‌ట‌కు వెల్లిపొవాలని సిఐడి కోరింది. 
 
మొత్తంమీద తుని ఘ‌ట‌న‌లో భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ప‌రోక్షంగా ప‌నిచేసిన‌ట్లు సిఐడికి ఫోన్ ఆధారాలున్నాయ‌ని తెలుస్తోంది. ఇదే నిరూపితం అయితే భూమ‌న‌ను జుడీషియ‌ల్ క‌స్ట‌డీ కోరే అవ‌కాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోలాలంపూర్‌ ఎయిర్ ‌పోర్టులో శ్రీలంక రాయబారిపై దాడి.. పిడిగుద్దులు..