Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భూమా నాగిరెడ్డికి ఇష్టమైన నేతలు ఎన్టీఆర్... వైఎస్ఆర్... మరి చంద్రబాబు?

నంద్యాల ఎమ్మెల్యేగా ఉంటూ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డికి ఇష్టమైన రాజకీయ నేతలు ఎవరో తెలుసా? వారెవరో కాదు. స్వర్గీయ ఎన్టీఆర్, వైఎస్.రాజశేఖర్ రెడ్డిలు. వీరిద్దరంటే అమితమైన ఇష్టమట.

భూమా నాగిరెడ్డికి ఇష్టమైన నేతలు ఎన్టీఆర్... వైఎస్ఆర్... మరి చంద్రబాబు?
, మంగళవారం, 14 మార్చి 2017 (13:33 IST)
నంద్యాల ఎమ్మెల్యేగా ఉంటూ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డికి ఇష్టమైన రాజకీయ నేతలు ఎవరో తెలుసా? వారెవరో కాదు.  స్వర్గీయ ఎన్టీఆర్, వైఎస్.రాజశేఖర్ రెడ్డిలు. వీరిద్దరంటే అమితమైన ఇష్టమట. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం రాజకీయ నేతగా కాకపోయినా... మంచి పరిపాలనాదక్షుడిగా భూమా నాగిరెడ్డి అభిమానించేవారట. 
 
అందుకే ప్రజారాజ్యం పార్టీ నుంచి వైకాపాలో చేరి... వైకాపా టిక్కెట్‌ ఎమ్మెల్యేగా గెలిచి.. తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌లు ఇష్టమైన నేతలనైప్పటికీ... రాజకీయంగా కొనసాగేందుకు ఆయన చంద్రబాబుతో చేతులు కలిపినట్టు ఆయన అనుచరులు చెపుతుంటారు. 
 
అలాగే, మా నాగిరెడ్డికి ఇష్టమైన ఆహారం విషయానికొస్తే, చికెన్ బిర్యానీ. రేంజ్ రోవర్ వాహనంలో ప్రయాణించడానికి ఎక్కువగా ఇష్టపడతారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఇక భూమా, శోభా నాగిరెడ్డిల సంతానం విషయానికొస్తే, కుమార్తెలు అఖిల ప్రియ (ప్రస్తుతం ఎమ్మెల్యే), భూమా మౌనిక, కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా రాజకీయం హీరోలా ఉంటుంది.. చంద్రబాబు రాజకీయం విలన్‌లా ఉంటుంది.. జగన్