Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెలూన్ విమానాలొస్తున్నాయి... ముట్టుకుంటే షాక్, విశాఖ, హైదరాబాద్

హైద‌రాబాద్: హైదరాబాద్‌, శాస్త్రీయ పరిశోధనల కోసం బెలూన్‌ విమానాలు అందుబాటులోకి రానున్నాయి. పరిశోధనలకు అవసరమైన వివిధ పరికరాలను మోసుకెళ్తూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు ఆకాశంలో రంగు రంగుల భారీ బెలూన్‌ విమానాలు ఇక దర్శనం ఇవ్వనున్నాయి. ఈ బెలూన్‌

Advertiesment
Balloon planes
, మంగళవారం, 15 నవంబరు 2016 (20:40 IST)
హైద‌రాబాద్: హైదరాబాద్‌, శాస్త్రీయ పరిశోధనల కోసం బెలూన్‌ విమానాలు అందుబాటులోకి రానున్నాయి. పరిశోధనలకు అవసరమైన వివిధ పరికరాలను మోసుకెళ్తూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు ఆకాశంలో రంగు రంగుల భారీ బెలూన్‌ విమానాలు ఇక దర్శనం ఇవ్వనున్నాయి. ఈ బెలూన్‌ విమానాలు అకస్మాత్తుగా తమ పొలంలోనో.. తమ నివాస ప్రాంతాలకు దగ్గరలోనో దిగితే.. ఆశ్చర్యానికీ.. భయానికీ లోనుకావాల్సిన అవసరం లేదు. 
 
అయితే.. వాటి సమీపానికి వెళ్లడం కానీ.. అందులోని వస్తువులను ముట్టుకోవడం కానీ చేయవద్దు. ఎందుకంటే.. ఈ పరికరాల్లో విద్యుత్ ప్రవహిస్తుంది. వాటిని తాకితే భారీ షాక్‌కు గురయ్యే ప్రమాదముంది. ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30 వరకు శాస్త్రీయ పరిశోధానల కోసం అణు ఇంధన శాఖ, ఇస్రో సహకారంతో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్ (టీఏఎఫ్‌ఆర్‌) 10 బెలూన్‌ విమానాలను ప్రయోగించనుంది.
 
శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించిన పరికరాలను ఎత్తయిన ప్రాంతాల నుంచి నిర్ణీత ప్రాంతాలకు ఈ బెలూన్‌ విమానాలు మోసుకువెళ్తాయని టీఐఎఫ్‌ఆర్‌ శాస్త్రవేత్త బి.సునీల్‌ కుమార్‌ పేర్కొన్నారు. పాలథిన్‌ ప్లాస్టిక్‌ ఫిలింలతో 50 మీటర్ల నుంచి 85 మీటర్ల మేర ఉండే ఈ బెలూన్‌ విమానాలు ఎత్తయిన ప్రాంతం నుంచి పరిశోధనా పరికరాలను ప్యారాచూట్‌ సాయంతో కిందకు విడిచి పెడతాయని వివరించారు. విశాఖపట్నం, హైదరాబాద్‌, షోలాపూర్‌ లైన్‌లలో విమానాలు ఎగురుతాయని సునీల్‌ చెప్పారు. 
 
కిందకు వచ్చిన ప్యారాచూట్‌లను ఎవరూ ముట్టుకోవద్దని... దిగిన స్థలం నుంచి వాటిని కదల్చవద్దని హెచ్చరించారు. ప్యారాచూట్‌లో ఉన్న పరికరాల ప్యాకేజీపై రాసిన టెలిఫోన్‌ నంబరుకు ఫోన్‌ చేయవద్దని సూచించారు. సమీపంలోని పోలీసు స్టేషన్‌ లేదా పోస్టాఫీసులకు ఈ ప్యారాచూట్‌కు సంబంధించిన సమాచారం అందజేయాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముద్రగడ పాదయాత్రకు హైకోర్టు అంగీకారం... ముద్రగడ గృహ నిర్బంధం...