Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నారా లోకేష్‌ను వదలని అపశకునాలు: పదిరోజుల్లో పార్టీకి మూడు సమస్యలు

లోకేష్ ఎంఎల్‌సీ సీటుకు నామినేషన్ వేసిన తర్వాత అతడి ఆస్తుల ప్రకటనపై పెద్ద వివాదం చెలరేగింది. ఆ తర్వాత అగ్రిగోల్డ్ కేసును పార్టీ పక్కకు తప్పిస్తోందన్న ఆరోపణలను టీడీపీ ఎదుర్కొంది. దీంట్లో కూడా లోకేషే కేంద్ర బిందువుగా అయ్యాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడ

నారా లోకేష్‌ను వదలని అపశకునాలు: పదిరోజుల్లో పార్టీకి మూడు సమస్యలు
హైదరాబాద్ , గురువారం, 30 మార్చి 2017 (09:21 IST)
రాజకీయాల్లో ఐరన్ లెగ్ అనే నమ్మకం చాలా బలంగా చాలా కాలంగా కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఇప్పుడు అలాంటి అపశకునం ఒకటి గత కొంత కాలంగా వెంటాడుతోందా అంటే అవునంటున్నారు గ్రహబలాలపై విశ్వాసం ఉన్నవారు. ఎందుకంటే లోకేష్ ఏ ముహూర్తంలో టీడీపీ తరపున ఎంఎల్‌సీగా ఎంపికయ్యాడో కానీ అప్పటినుంచి ఆ పార్టీని సమస్య మీద సమస్య వెంటాడుతోంది. 
 
దీనికి రుజువుగా బుధవారం టీడీపీ కార్యకర్త అప్పసాని ఈశ్వర్ ఆత్మహత్య. టీడీపీ నాయకత్వం నిజమైన పార్టీ కార్యకర్తలను ఘోరంగా నిర్లక్ష్యం చేస్తోందని  తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతూ ఈశ్వర్ ఆత్యహత్యం చేసుకున్నాడు. అది నోట్ రూపంలో రావడం టీడీపీకి ఇబ్బందకరంగా మారడంతో ఆ నోట్‌ను పార్టీ నేతలు మాయం చేసేశారు. కానీ ఆత్మహత్య చేసుకోవడానికి మందు ఈశ్వర్ ఫేస్‌బుక్‌లో తన నోట్స్‌ని పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. 
 
టీడీపీ విద్యార్థి సమాఖ్య టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన ఈశ్వర్ తనకు తన అనుయాయులకు ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా సహించి ఊరకుండిపోయాడు కానీ ఇతర పార్టీలనుంచి ఫిరాయించి టీడీపీలో చేరినవారిని నాయకత్వం ప్రోత్సహిస్తున్న తీరునూ చూసి తట్టుకోలేకపోయాడు.
 
గతంలో టీడీపీని ఓడించడానికి తీవ్రంగా ప్రయత్నించిన స్వార్థపరశక్తుల నుంచి పార్టీని కాపాడండి గుడ్‌బై అంటూ ఈశ్వర్ రాసిన ఉత్తరం ఫేస్‌బుక్ ద్వారా వైరల్ కావటం ప్రత్యేకించి నారా లోకేశ్‌కు మహా ఇబ్బందికరంగా మారింది. పార్టీ తన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పడు, లోకేష్‌ను చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకోబోతున్న తరుణంలో ఈశ్వర్ నాయకత్వంపై ఆరోపించి మరీ ఆత్మహత్యకు పాల్పడటం అపశకునంలాగా ఎదురయిందని రాజకీయ పరిశీలకుల వ్యాఖ్య.
 
లోకేష్ ఎంఎల్‌సీ సీటుకు నామినేషన్ వేసిన తర్వాత అతడి ఆస్తుల ప్రకటనపై  పెద్ద వివాదం చెలరేగింది. ఆ తర్వాత అగ్రిగోల్డ్ కేసును పార్టీ పక్కకు తప్పిస్తోందన్న ఆరోపణలను టీడీపీ ఎదుర్కొంది. దీంట్లో కూడా లోకేషే కేంద్ర బిందువుగా అయ్యాడు.  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఊచకోతకు గురైన చరిత్రకు లోకేష్ సాక్షిగా నిలిచాడు. ఇప్పుడు వరుసగా అపశకునాలు వస్తుండటంతో లోకేశ్ ఎన్ని అనర్థాలను, అపశకునాలను ఎదుర్కోవలసి వస్తుందో అని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్మగ్లర్ సంగీత ఛటర్జీ అరెస్ట్.. కో‌ల్‌కతా పిజ్జా కార్నర్ వద్ద పట్టేశారు.. 14 రోజుల రిమాండ్