Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాకినాడలో నాలుగు కాళ్లతో పుట్టిన శిశువు..

కాకినాడలో నాలుగు కాళ్లతో కూడా ఓ శిశువు పుట్టింది. ఏపీలోని కాకినాడలో ఉన్న తపస్వరం ప్రాంతానికి చెందిన మణిబాల (25)కు శుక్రవారం సాయంత్రం ఓ ప్రభుత్వాసుపత్రిలో మగశిశువు జన్మనిచ్చింది. ఈ శిశువు నాలుగు కాళ్లత

Advertiesment
కాకినాడలో నాలుగు కాళ్లతో పుట్టిన శిశువు..
, శనివారం, 24 జూన్ 2017 (17:28 IST)
కాకినాడలో నాలుగు కాళ్లతో కూడా ఓ శిశువు పుట్టింది. ఏపీలోని కాకినాడలో ఉన్న తపస్వరం ప్రాంతానికి చెందిన మణిబాల (25)కు శుక్రవారం సాయంత్రం ఓ ప్రభుత్వాసుపత్రిలో మగశిశువు జన్మనిచ్చింది.

ఈ శిశువు నాలుగు కాళ్లతో జన్మించినట్లు వైద్యులు తెలిపారు. శిశువు కడుపు ప్రాంతం నుంచి అతికినట్లు నాలుగు కాళ్లున్నట్లు వైద్యులు తెలిపారు. రోజూ జన్మించే పదిలక్షల శిశువుల్లో ఓ శిశువు ఇలా జన్మించేందుకు అవకాశం ఉంది. 
 
శిశువు నాలుగు కాళ్లతో పుట్టినప్పటికీ తల్లి,శిశువు క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. శిశువును మాత్రం ఐసీయూలో ఉంచినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ శిశువును చూసేందుకు ఆస్పత్రికి ప్రజలు తరలి వస్తున్నారు. కానీ వైద్యులు వారిని ఆస్పత్రిలోకి అనుమతించట్లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్ నిరక్ష్యరాస్యుడు, ఫైనాన్షియల్ ఫ్రాడ్.. అంతా మీడియా హైపే: సుబ్రహ్మణ్య స్వామి