Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరద బాధితులకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు: ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని

వరద బాధితులకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు: ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని
, బుధవారం, 19 ఆగస్టు 2020 (08:04 IST)
పశ్చిమగోదావరి జిల్లాలో వరద పీడిత ప్రాంతాల్లో ప్రజలను, వరద బాధితులను ఆధుకోవడంలో ఎక్కడ రాజీ పడవద్దని, బాధితులకు పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినట్టు ఏపి డిప్యూటీ, సిఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
 
పశ్చిమగోదావరి జిల్లాలో 26శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిలో 5వేల మంది వరద బాధితులకు వసతి కల్పించామని, వారికి నిత్యావసర వస్తువులు సరఫరా చేసినట్టు మంత్రి ఆళ్ల నాని చేప్పారు. 

జిల్లాలో సుమారుగా 71గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయయని ఆయా గ్రామాల్లో 10వేల కుటుంబాలు ఉన్నాయని, వరద బాధితులకు సహాయక చర్యలు కోసం జిల్లా యంత్రాంగం 7లాంచిలు, 36బోట్లు ఏర్పాటు చేసినట్టు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 

జిల్లాలోని ఏజెన్సీ మండలాలు అయిన కుక్కునూరు, వేలేరు పాడు, పోలవరం, బుట్టాయి గూడం ప్రాంతాల్లో 2లక్షలు మంచినీటి పాకెట్స్, అందచేశామని, గిరిజనలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు లాంచిల ద్వారా జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు రాజు అధికారులు ద్వారా సరఫరా చేసినట్టు మంత్రి ఆళ్ల నాని చేప్పారు. 

వరద బాధితులకు వసతి శిబిరాల్లో నాణ్యమైన ఆహారం, పిల్లలకు బిస్కెట్ పాకెట్స్, పాలు, బ్రెడ్, అందచేసామని,, కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ మాస్క్ లు, శానిటైజర్లు అందించినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వివరించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో అంటు వ్యాధులు ప్రభలకుండా శానిటేషన్ చేయడం, వైద్య ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. 

జిల్లా ఇంచార్జి మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ గోదావరి వరద ముంపు బాధితులకు 2వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి అదేశిoచారని, మానవత దృక్పధంతో వారిని ఆదుకోవాలని, మన కుటుంబంలో కష్టం వచ్చినట్టు భావించాలని సిఎం ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి పేర్ని నాని తెలియజేశారు. 

వరద బాధితులకు సహాయక శిబిరాల్లో ఎక్కడ లోపం లేకుండా ప్రజలనుండి పిర్యాదులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశిo చినట్టు మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. 

ప్రతి శిబిరానికి ఒక అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించచామని వరద బాధితుల శిబిరాలు పర్యవేక్షిo చే బాధ్యతలు జాయింట్ కలెక్టర్ కు అప్పగించామని మంత్రి పేర్ని నాని చేప్పారు. 

వరద తగ్గుముఖం పట్టగానే 10రోజుల్లో పంట నష్టంపై అంచనాలు సిద్ధం చేసి, విలైనంత త్వరగా పంపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ఆదేశిoచినట్టు జిల్లా ఇంచార్జి మంత్రి పేర్ని నాని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 3 ఇంటర్నేషనల్ స్టేడియాలు