Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ సీఎం జ‌గ‌న్ చిత్ర ప‌టానికి ఆర్య వైశ్యుల పాలాభిషేకం

Advertiesment
ఏపీ సీఎం జ‌గ‌న్ చిత్ర ప‌టానికి ఆర్య వైశ్యుల పాలాభిషేకం
విజ‌య‌వాడ‌ , శనివారం, 30 అక్టోబరు 2021 (10:37 IST)
ఆర్య వైశ్య స‌త్రాల‌ను దేవాదాయ‌శాఖ నుంచి త‌ప్పించి, వాటిని తిరిగి ఆర్య‌వైశ్యుల‌కే అప్ప‌గించ‌డం ఆ వ‌ర్గం నేత‌ల్లో తీవ్ర ఆనందాన్ని నింపింది. గుంటూరు బృందావన్ గార్డెన్స్ 2వ లైన్ లో పశ్చిమ నియోజకవర్గ  ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరిధ‌ర్ కార్యాలయంలో ఈ సంద‌ర్భంగా సంబ‌రాలు చేశారు.
 
 
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దేవాదాయ శాఖలో ఉన్న ఆర్యవైశ్య సత్రాలు, శ్రీ వాసవి చౌల్ట్రీస్ ను వాటి అభివృద్ధికి తిరిగి ఆర్యవైశ్య లకే ఇవ్వటం ఎంతో సంతోషకరమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళి గిరిధర్ (గిరి) అన్నారు. ఈ సందర్భంగా ప్రియతమ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం జరిగింది. 
 
 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ సీనియర్ నాయకులు ఆతుకూరి ఆంజనేయులు, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి చైర్మన్ దేవరశెట్టి చిన్ని, సభ్యులు టిఎల్ వి ఆంజనేయులు, తూనుగుంట్ల నాగేశ్వరరావు , మద్దాళి సుధాకర్, వాసవి క్లబ్ - గుంటూరు అధ్యక్షులు వక్కలగడ్డ నాగేశ్వరరావు, గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆతుకూరి నగేష్, గుడిపాటి భాస్కర్, మున్నలూరి గౌరీ శంకర్, గుంటూరు అర్బన్ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు మొగిలి సతీష్ కుమార్, నూనె కిషోర్, బాబ్జి, పద్మనాభుని ఈశ్వర్ రావు, మాజేటి కిషోర్, మైలవరపు ప్రవీణ్, నంబూరు హరీష్, షరభూ కృష్ణమూర్తి, గ్రంధి శ్రీమాన్ , శరణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీనియర్ సిటిజన్లకు ఒళ్ళు అల‌వ‌కుండా... తిరుమ‌ల శ్రీవారి ఉచిత దర్శనం