Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు

Advertiesment
సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు
, ఆదివారం, 28 మార్చి 2021 (19:39 IST)
పట్టణ ప్రాంతాల్లో 45 ఏళ్లు దాటినవారికి కోవిడ్‌-19 వాక్సినేషన్‌ ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి సచివాలయాల ద్వారా నిర్వహించటంలో భాగంగా ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ భారత్‌పేట, కుందలరోడ్డులోని వార్డు సచివాలయాలను పరిశీలించారు.

భారత్‌పేటలోని 140 వార్డు సచివాలయం, కమ్యూనిటీ సెంటరులో, కుందుల రోడ్డులోని 117వ వార్డు సచివాలయం వద్ద వాక్సినేషన్‌ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లపై సంయుక్త కలెక్టర్లు పి.ప్రశాంతి, కె.శ్రీధర్‌రెడ్డి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జె.యాస్మిన్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధతో చర్చించారు.

వైద్యారోగ్యశాఖ నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్‌, వెయిటింగ్‌ రూమ్‌, వాక్సిన్‌ ఇచ్చే రూం, అబ్జర్వేషన్‌ రూంలను ఏర్పాటు చేయాలని, వాక్సిన్‌ తీసుకోవటానికి వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించాలని కలెక్టర్‌ సూచించారు.

కార్యక్రమంలో నగర మేయర్‌ కావటి శివనాగమనోహర్‌ నాయుడు, పశ్చిమ ఎమ్మెల్యే మద్ధాళి గిరిధర్‌, ఇన్‌చార్జి ఆర్‌డీవో డేవిడ్‌రాజ్‌, జిఎంసి అదనపు కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, తహశీల్దార్‌ తాతా మోహనరావు, డిప్యూటీ కమిషనర్‌ బి.శ్రీనివాసరావు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎపిలో 1005 మందికి కరోనా