పెట్రోల్ బంక్‌కు వెళుతున్నారా? ఇవి గమనించండి.... లేకపోతే నష్టపోతారు!
ఏటా రహదారుల పైకి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వాటి ఇంధన ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీన్ని అదనుగా చేసుకున్న కొందరు యజమానులు తమ పెట్రోల్ బంకుల్లో యథేచ్ఛగా వినియోగదారులను మోసం చేస్తూ, సొమ్ము చేసుకుంటున్నారు. అయితే పెట్రోల్ బంకుల్లో
ఏటా రహదారుల పైకి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వాటి ఇంధన ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీన్ని అదనుగా చేసుకున్న కొందరు యజమానులు తమ పెట్రోల్ బంకుల్లో యథేచ్ఛగా వినియోగదారులను మోసం చేస్తూ, సొమ్ము చేసుకుంటున్నారు. అయితే పెట్రోల్ బంకుల్లో మనల్ని ఏమార్చి అక్కడి సేల్స్‌మెన్ మనల్ని ఏవిధంగా మోసం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
పెట్రోల్ నింపే నాజిల్‌ను సేల్స్‌మెన్ తమ చేతి వేళ్లతో ఎప్పటికీ పట్టుకునే ఉండటం మీరు చూశారా? అయితే ఈ విధంగా చేసే వారి పట్ల జాగ్రత్త వహించండి. ఎందుకంటే వారు నాజిల్‌ను మధ్య మధ్యలో పట్టుకుని వదిలేస్తుంటారు. అలా చేయం వల్ల ట్యాంక్ నిండే సమయంలో ఇంధన సరఫరాకు బ్రేక్ పడుతుంది. దీంతో ఫ్యుయల్ తక్కువగా లోడ్ అవుతుంది. అయితే స్క్రీన్‌పై మాత్రం పూర్తిగా నింపినట్టు నంబర్లు కనిపిస్తాయి.
సాధారణంగా వాహనాల్లోకి ఇంధనం నింపే డీజిల్, పెట్రోల్ పైపుల చివరి భాగం ఎక్కువ పొడవుగా ఉంటుంది. అయితే ఇందులోనూ ఓ ట్రిక్ ఉంది. మనం ఇంధనాన్ని నింపమని చెబితే చివరి సమయంలో పూర్తిగా నిండకుండానే ఒక్కోసారి ముందుగానే పైప్‌ను ట్యాంక్‌లో నుంచి తీసేస్తారు. అలా తీసిన సమయంలో కొంత ఇంధనం పైప్ ముందు భాగంలో అలాగే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆ ఇంధనం కూడా మనకే దక్కాలి. కానీ మనం తీసుకోకుండానే దానికి కూడా డబ్బులు చెల్లిస్తాం.
ఇక పెట్రోల్ బంకుల్లో మనల్ని మోసం చేసే మరో ట్రిక్ ఇది. ఇంధనం నింపే వ్యక్తి మనతో మాటలు కలిపి మన ఏకాగ్రతకు భంగం కలిగిస్తాడు. దీంతో ఎంత ఇంధనం నిండింది సరిగ్గా చూసుకోం. అప్పుడు కూడా మనం మోసపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఇంకో ట్రిక్ విషయానికి వస్తే పైన చెప్పిన దానికి అదనమే అవుతుంది. అదేంటంటే ఉదాహరణకు మీరు వేయి రూపాయల ఇంధనం నింపమని అడిగితే సేల్స్ వ్యక్తులు రూ.200 వరకు నింపి ఎంత అని మళ్లీ మధ్యలో అడుగుతారు. అప్పుడు మీటర్‌ను 0 కు రీసెట్ చేయకుండా రూ.800తో క్లోజ్ చేస్తారు. దీంతో ముందు రూ.200, తరువాత రూ.800 అనుకుని మీరు రూ.1000 చెల్లిస్తారు. అప్పుడు రూ.200 మోసగింపబడతారు. ఇలాంటి మోసాలు కూడా పెట్రోల్ బంకుల్లో జరిగేందుకు అవకాశం ఉంది.
చివరిగా ఇంకో మోసం చేసే ట్రిక్ గురించి తెలుసుకోండి. ఇంధనం నింపమని మీరు అడిగితే ముందు సేల్స్ వ్యక్తి సరైన విధంగానే ఫ్యుయల్ నంబర్‌ను ఎంటర్ చేస్తాడు. ఉదాహరణకు రూ.500 కావాలనుకుంటే రూ.500.00 అని ఎంటర్ చేస్తాడు. అయితే మధ్యలో మాటల ద్వారా మీ దృష్టి మరల్చి ఆ రీడింగ్‌ను 500గా మారుస్తాడు. ఇక చివర్లో ఆ 500ని చూసి మీరు రూ.500 ఇస్తారు. కానీ అంతే మొత్తంలో ఇంధనం మీకు అందదు. ఎందుకంటే రూ.500.00 అని ఎంటర్ చేస్తే స్క్రీన్ అలాగే ఉంటుంది. కానీ 500 ఎంటర్ చేస్తే స్క్రీన్ బ్లింక్ అవుతుంది. అంటే మోసం జరిగిందని గుర్తించాలి.