Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో జనవరి 6 నుంచి సంక్రాంతి స్పెషల్ బస్సులు

apsrtc
, గురువారం, 15 డిశెంబరు 2022 (09:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ కోసం ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఈ బస్సులు జనవరి ఆరో తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పొరుగు రాష్ట్రాలకు కూడా ప్రత్యేకంగా వంద బస్సులను నడుపనున్నారు. సంక్రాంతి పండుగ కోసం నడిపే ప్రత్యేక బస్సులో చార్జీలను సాధారణ చార్జీలే వసూలు చేస్తామని ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. 
 
పండుగ కోసం ఊర్లు వెళ్లే వారి సౌకర్యార్థం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు బస్సులను నడుపనుంది. ఇవి జనవరి ఆరో తేదీ నుంచి 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. అలాగే, ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా బస్సులను నడుపనున్నట్టు తెలిపింది. విజయవాడ నుంచి  వెయ్యి ప్రత్యేక బస్సులను పలు ప్రాంతాలకు నడుపుతామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు ఈ బస్సుల్లో ప్రయాణం చేయదలచిన వారు ఆర్టీసీ వెబ్‌సైట్, టిక్కెట్ బుకింగ్ కేంద్రాల ద్వారా టిక్కెట్లు రిజర్వేషన్లు చేసుకోవచ్చని తెలిపింది.
 
కాగా, తెలంగాణ ఆర్టీసీ కూడా సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే 4,233 ప్రత్యకే బస్సులను ప్రకటించింది. వీటిలో 585 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఈ బస్సులు జనవరి 7వతేదీ నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. టీఎస్ఆర్టీసీ నడుపుతున్న బస్సులో 125 అమలాపురం, 117 కాకినాడ, 83 కందుకూరు, 65 విశాఖపట్టణం, 51 బస్సులు పోలవరం, 40 బస్సులు రాజమహేంద్రవరానికి నడుపనున్నట్టు తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తన భార్య ప్రియుడి మొబైల్ విశ్లేషించాలన్న భర్త.. కుదరదన్న హైకోర్టు