Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంక్రాంతికి ఏ.పి.ఎస్.ఆర్.టి.సి భారీ కలెక్షన్లు

సంక్రాంతికి ఏ.పి.ఎస్.ఆర్.టి.సి భారీ కలెక్షన్లు
, శనివారం, 23 జనవరి 2021 (10:30 IST)
సంక్రాంతి పండుగని పురస్కరించుకుని వివిధ రాష్ట్రాల నుండి ఏ.పి లోని తమ సొంత ఊర్లకు వచ్చిన ప్రయాణికుల కోసం ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపింది.

ఈ సంక్రాంతి సమయంలో కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు పాటించి, ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా వారి అభిరుచి మేరకు బస్సు సర్వీసులు నడిపి అందరి  మన్ననలు పొందిందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్)  కె.ఎస్.బ్రహ్మానంద రెడ్డి తెలిపారు.
    
సంక్రాంతి ముందు రోజుల్లో హైదరాబాద్, చెన్నై,బెంగళూరు వంటి నగరాల నుండి ఏ.పి.లోని  అన్ని ప్రాంతాలకు రోజు వారీ సర్వీసులతో  కలిపి మొత్తం 3202 బస్సులతో 10.27 లక్షల  మేర కిలో మీటర్లు నడిపి,82% ఓ.ఆర్.తో 38.76  ఈ.పి.కె. సాధించి రూ. 746.83 లక్షల ఆదాయం ఆర్జించింది.

అదేవిధంగా తిరుగు ప్రయాణం లో కూడా అన్ని ప్రాంతాల నుండి ప్రధాన నగరాలకు బస్సు సర్వీసులు ఏర్పాటుచేసింది.  మొత్తం 2402  బస్సులతో 13.87  లక్షల  మేర కిలో మీటర్లు నడిపి, 87% ఓ.ఆర్. తో 41.14  ఈ.పి.కె. సాధించి  రూ. 570.45 లక్షల ఆదాయం ఆర్జించింది.

మొత్తం మీద ఈ పండుగ సమయంలో  5684  బస్సులతో 33.14  లక్షల  మేర కిలో మీటర్లు నడిపి,84%  ఓ.ఆర్.తో 39.76  ఈ.పి.కె. సాధించి  రూ. 1317.28 లక్షల ఆదాయం ఆర్జించింది. 

84 % ఓ.ఆర్. సాధించడమే కాకుండా సంస్థ ఆదాయం పెంచడంలో కృషి చేసిన డ్రైవర్ కండక్టర్లకు, సూపెర్వైజర్లకు, కంట్రోలర్లకు, ట్రాఫిక్ మరియు గ్యారేజీ, తదితర  సిబ్బందిని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) బ్రహ్మానందరెడ్డి అభినందించారు. ఇదే స్పూర్తితో పనిచేసి క్రమక్రమంగా సంస్థ అభివృద్ధికి శ్రమించాలని ఈ సందర్భంగా బ్రహ్మానంద రెడ్డి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల