Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీఎస్ ఆర్టీసీలో కొత్త సేవలు ప్రారంభం.. చార్జీలు ఇవే

apsrtc
, ఆదివారం, 24 జులై 2022 (15:55 IST)
ఏపీఎస్ఆర్టీసీలో కొత్త సేవలు ప్రారంభించనుంది. ఈ రోడ్డు రవాణా సంస్థ కార్గో విభాగాన్ని అందుబాటులోకి తీసుకునిరానుంది. అలాగే, డోర్ డెలివరీ సదుపాయం కల్పించనుంది. 50 కేజీల వరకు మీరు బుకింగ్ చేసిన పార్శిల్, కొరియర్స్​ను ఇంటి వద్దకే చేర్చేలా చర్యలు తీసుకోనుంది. ఈ సేవలను ఆర్టీసీ సెప్టెంబరు 01వ తేదీ నుంచి ప్రారంభించనుంది.
 
పార్శిల్ కౌంటర్ నుంచి 10కిలో మీటర్ల పరిధిలో ఈ డోర్ డెలివరీ అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని జిల్లా కేంద్రాలు, 84 ముఖ్యపట్టణాలలో డోర్ డెలివరి సదుపాయం కల్పిస్తున్నారు. ఈ సేవలకు వసూలు చేసే ధరలను కూడా ప్రకటించింది ఒక కేజీ వరకు రూ.18, 1 నుంచి 6 కేజీల వరకు రూ.30, 6 నుంచి 10 కేజీల వరకు రూ.36, 10 నుంచి 25 కేజీల వరకు రూ.48, 25 కేజీల వరకు 50 కేజీల వరకు రూ.59 చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో మరో మంకీపాక్స్ కేసు - ఢిల్లీ వాసిలో గుర్తింపు