Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దివ్యదర్శనం కార్యక్రమానికి అనూహ్య స్పందన...

దేవాదాయ శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దివ్యదర్శనం కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుంది. పేద హిందువుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్యదర్శనం కార్యక్రమానికి ఐదు రోజుల్లోనే 5 వేల మంది ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. తొలివిడతగా 13 జిల్లాల నుం

దివ్యదర్శనం కార్యక్రమానికి అనూహ్య స్పందన...
, బుధవారం, 7 డిశెంబరు 2016 (19:16 IST)
దేవాదాయ శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దివ్యదర్శనం కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుంది. పేద హిందువుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్యదర్శనం కార్యక్రమానికి ఐదు రోజుల్లోనే 5 వేల మంది ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. తొలివిడతగా 13 జిల్లాల నుంచి 10వేల మందిని తీర్థయాత్రలకు తీసుకెళ్లాలని దేవాదాయశాఖ లక్ష్యంగా పెట్టుకొంది. జనవరి 2, 2017 నుంచి దివ్యదర్శనం యాత్ర ప్రారంభం చేస్తారు. ఆన్‌లైన్లో వచ్చిన అప్లికేషన్లను జిల్లాల వారీగా విభజించే ప్రక్రియ కోసం ప్రత్యేక వ్యవస్థను దేవాదాయ శాఖ ఏర్పాటు చేసింది. రోజూ వచ్చే అప్లికేషన్లను ఆయా జిల్లాలవారీగా విభజించి అందుకు అనుసరించాల్సిన విధానం ప్రకారం దేవదాయ శాఖ అధికారులు అడుగులు వేస్తారు.
 
దరఖాస్తుల సంఖ్యను బట్టి ఎంపిక పద్ధతి
ఎంపిక చేసిన మండలాల్లో 200 మంది కంటే తక్కువ మంది దివ్యదర్శనం పథకానికి దరఖాస్తు చేసుకుంటే వారందరినీ దివ్యదర్శనం కార్యక్రమానికి తీసుకెళ్తారు. ఒకవేళ ఎక్కువ మంది తీర్థయాత్రలకు వెళ్లాలని భావిస్తే అప్పుడు లాటరీ పద్ధతి ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎన్నడూ తీర్థయాత్రలకు నోచుకోని భక్తులను ఈ పథకం కింద పుణ్యక్షేత్రాలకు పంపించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 
 
జిల్లాలో డ్రాప్ బాక్సుల ఏర్పాటు
ఇక రాష్ట్ర వ్యాప్తంగా దివ్యదర్శనం కార్యక్రమానికి మాన్యూవల్‌గా అప్లై చేయాలని భావించిన భక్తులు నేరుగా ఎమ్మార్వో ఆఫీసుల్లో డ్రాప్ బాక్సులో దరఖాస్తు వేయాల్సి ఉంటుంది. ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన దరఖాస్తులను జిల్లా దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వాటిని మండలాలవారీగా విభజించి అనుసరించాల్సిన పద్ధతి ప్రకారం అడుగులు వేస్తారు. దివ్యదర్శనానికి ఆన్ లైన్లో 7వ తారీఖు 4 గంటల సమయానికి 4544 మంది దరఖాస్తు చేసుకున్నారు. 
 
ఆన్‌లైన్లో 30 నుంచి 40 వేల దరఖాస్తులు
ఒక్క ఆన్‌లైన్లోనే 30 నుంచి 40 వేల మంది దరఖాస్తు చేసుకుంటారని దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక డ్రాప్ బాక్సుల వద్ద పది వేల నుంచి 15 వేల వరకు దరఖాస్తులు రావొచ్చని అంచనాలో అధికారులు ఉన్నారు. తొలి విడత దివ్య దర్శనానికి 50 వేలకు పైగా అభ్యర్థను అందవచ్చని అంచనా. ఒక్కో మండలం నుంచి 200 మందిని దివ్యదర్శనం కింద ఎంపిక చేస్తారు. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మందిని తీర్థయాత్రలకు ప్రభుత్వం తీసుకెళ్తుంది. దివ్యదర్శనం కార్యక్రమం పేదలకు వరమని... ఈ కార్యక్రమం ద్వారా భక్తులకు పుణ్యక్షేత్రాలు దర్శించుకునే సదుపాయం కల్పిస్తున్నామని దేవదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. 
 
దివ్యదర్శనం కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని అధికారులు వివరిస్తున్నారు. పేద హిందువులకు కార్యక్రమం ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుందని... పేదలకు ఈ తరహా కార్యక్రమం ప్రధమంగా రాష్ట్రంలోనే ప్రారంభించినట్టు అధికారులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విమానాశ్రయాల అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం దృష్టి