Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డాక్టర్‌ ప్రతాస్‌ సీ రెడ్డి బర్త్ డే సందర్భంగా 90వేల మొక్కలను నాటనున్న అపోలో ఫౌండేషన్‌- ఏపీ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌

Upasana
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (22:43 IST)
అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఫౌండర్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సీ రెడ్డి 90వ పుట్టిన రోజు వేడుకలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 90వేల మొక్కలను నాటేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌తో అపోలో హాస్పిటల్స్‌ ఫౌండేషన్‌ చేతులు కలిపింది. ఈ కార్యక్రమం ద్వారా కార్బన్‌ ఉద్గారాలను గణనీయంగా తగ్గించడంతో పాటుగా జంతుజాలానికి తగిన ఆవాసాలను కల్పించడం, స్థానిక కమ్యూనిటీలకు మెరుగైన గాలిని అందించడం లక్ష్యంగా చేసుకున్నారు.
 
అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సీ రెడ్డి మాట్లాడుతూ, ‘‘వాతావరణ మార్పు ప్రభావాన్ని తగ్గించడంతో పాటుగా పర్యావరణ అనుకూల భవిష్యత్‌కు భరోసా కల్పించే దిశగా చేపట్టిన కార్యక్రమమిది’’ అని అన్నారు.
 
అపోలో హాస్పిటల్స్‌ సీఎస్‌ఆర్‌ వైస్‌ ఛైర్‌ పర్సన్‌ ఉపాసన కామినేని కొణిదెల మాట్లాడుతూ ‘‘హరిత భవిష్యత్‌కు అర్ధవంతమైన తోడ్పాటునందిస్తూ మా ఛైర్మన్‌ యొక్క 90వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకునే అవకాశం రావడం పట్ల సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు. అటవీ శాఖ అవసరమైన మొక్కలను అందించనుండగా, వాటిని నాటడంతో పాటుగా నిర్వహణ బాధ్యతలను అపోలో హాస్పిటల్స్‌ చూడనుంది.
 
ఈ ప్లాంటేషన్‌ డ్రైవ్‌లో మియావాకీ ఫారెస్ట్‌ నమూనా వినియోగిస్తారు. తద్వారా ఆ ప్రాంతాలలో అత్యంత సహజంగా పెరిగే మొక్కలను నాటడంతో పాటుగా ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్‌ చేసి అవి చనిపోకుండా తగిన ఏర్పాట్లనూ చేస్తారు. పర్యావరణంపై సానుకూల ప్రభావం ఈ కార్యక్రమం ద్వారా పడనుందని అంచనా. పర్యావరణ పరిరక్షణ దిశగా ఫౌండేషన్‌ యొక్క నిబద్ధతకనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుంది.
 
ఈ 90వేల మొక్కలను అరగొండ చుట్టుపక్కల ప్రాంతాలలో నాటనున్నారు. తద్వారా అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ యొక్క కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ను 3800 టన్నుల మేర తగ్గించడంతో పాటుగా ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో భావినాయకునిగా తమ స్ధానాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది. పర్యావరణ పరిరక్షణ దిశగా అపోలో ఫౌండేషన్‌ నిబద్ధతకనుగుణంగా ఈ ప్రాజెక్ట్‌ ఉంటుంది. ఆరోగ్యవంతమైన రేపటి కోసం హరిత భవిష్యత్‌ను ప్రోత్సహించడానికి కంపెనీ కట్టుబడి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మింత్రా బ్రాండ్ రాయబారుల సమూహంలో చేరిన పాన్-ఇండియా స్టార్ తమన్నా భాటియా