అమరావతి: సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు తర్వాత మన రాష్ట్రంలో పైరవీలకు తావులేని పాలన నడుస్తోంది. ఫలితంగా గ్రామ పాలన వికసిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పాలనా పరిస్థితుల ఆధారంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో ఈ ఏడాది మన రాష్ట్రం ఏకంగా 17 అవార్డులను దక్కించుకుంది.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్వహించే సమావేశంలో శనివారం ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అవార్డుల పోటీలో దేశవ్యాప్తంగా 74 వేల గ్రామ పంచాయతీలు పోటీ పడినట్టు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది.