Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్‌ కళ్యాణ్‌కు యంగ్‌ హీరోల మద్దతు... ప్రత్యేక హోదాపై పవర్ స్టార్....

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా విషయమై పవన్‌ కళ్యాణ్‌ పలుసార్లు లేవతెత్తిన విషయం తెలిసిందే. ఇటీవలే తమిళనాడులో జల్లికట్టు ఆటపై అక్కడి తారాలోకం దిగి రావడంతో... ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రభావం పడింది. అక్కడి హీరోలకున్న పౌరుషం మనకు లేదంటూ... సోషల్‌ మీడియాలో ప్రశ్న

Advertiesment
ap special status
, సోమవారం, 23 జనవరి 2017 (22:49 IST)
ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా విషయమై పవన్‌ కళ్యాణ్‌ పలుసార్లు లేవతెత్తిన విషయం తెలిసిందే. ఇటీవలే తమిళనాడులో జల్లికట్టు ఆటపై అక్కడి తారాలోకం దిగి రావడంతో... ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రభావం పడింది. అక్కడి హీరోలకున్న పౌరుషం మనకు లేదంటూ... సోషల్‌ మీడియాలో ప్రశ్నలు సంధించారు. దీంతో పవన్‌ కళ్యాణ్‌ కూడా అందరూ ఏకమై ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు తెలపాలని   కోరారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు ఆంధ్ర ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దత్తు తెలపడం ప్రారంభిస్తున్నారు.
 
నిఖిల్‌, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, సందీప్‌ కిషన్‌ మరియు సంపూర్ణేష్‌ బాబు వంటి హీరోలు ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతున్నారు. రిపబ్లిక్‌డే నాడు 26న వైజాగ్‌ ఆర్కే బీచ్‌‌లో జరుగనున్న ప్రత్యేక హోదా మౌన పోరాటానికి యువహీరోలు వారి మద్దతుని ప్రకటించారు. సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ జనవరి 26 ప్రత్యేక హోదా ఉద్యమానికి తన మద్దతు తెలుపనున్నట్లు ప్రకటించారు. ఇది చిలికిచిలికి గాలివానలా మారుతుందో లేదో చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బడ్టెట్ 2017 పేద - మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించనుందా...?