Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో భారీ స్థాయిలో గంజాయి దహనం: దేశంలోనే తొలిసారి..! (video)

ఏపీలో భారీ స్థాయిలో గంజాయి దహనం: దేశంలోనే తొలిసారి..! (video)
, శనివారం, 12 ఫిబ్రవరి 2022 (14:00 IST)
ఏపీలో భారీ స్థాయిలో గంజాయిని దహనం చేయనున్నారు. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంతో రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఈ ఆపరేషన్‌లో రాష్ట్రంలోని వివిధ శాఖల సమన్వయంతో పాటు.. సరిహద్దు రాష్ట్రాల సహకారంతో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 
 
గిరిజన  గ్రామాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగుపై  గతంలో ఎన్నడూ లేనివిధంగా దాడులు చేసి గంజాయి తోటలను ధ్వంసం చేశారు. అలాగే గంజాయి సాగు చేయకుండా యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇతర పంటలు సాగు చేసేలా ప్రోత్సహించారు.
 
అనేక దశాబ్దాలుగా ఏవోబీతో పాటు గిరిజన గ్రామాలలో కొనసాగుతున్న గంజాయి సాగుపై గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలో పట్టుబడిన రెండు లక్షల కిలోల గంజాయిని శనివారం నాడు దహనం చేయనుంది. 
 
ఈ గంజాయి విలువ సుమారు రూ.500 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ గంజాయి దహనం కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఓ ఈవెంట్‌లా నిర్వహించబోతోంది. దీని కోసం టెంట్లు, స్పీకర్లు, డ్రోన్ కెమెరాలు వాడుతోంది.భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఏపీ పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని దహనం చేయనున్నారు.


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ప్రత్యేక హోదా అంశం.. ఈ నెల 17న చర్చలకు రండి..