Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోనసీమ అల్లర్లు - కొనసాగుతున్న అరెస్టులు - 4 మండలాల్లో పునరుద్ధరణ

INTERNET
, బుధవారం, 1 జూన్ 2022 (07:38 IST)
కోనసీమలో హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేసే పనిలో పోలీసులు నిమగ్నమైవున్నారు. ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేసిన పోలీసులు.. ఈ అల్లర్లతో సంబంధం ఉన్న మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నారు. 
 
మరోవైపు, జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఇంటర్నెట్ సేవలను దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు. ఈ హింస చెలరేగిన తర్వాత అమలాపురంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇపుడు పరిస్థితులు చక్కబడటంతో క్రమంగా పునరుద్ధరిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, మంగళవారం సఖినేటిపల్లి మల్కిపురం, ఆత్రేయపురం, ఐ పోలవరం మండలాల్లో ఇంటర్నెట్ సేవలను పోలీసులు పునరుద్ధరించారు. జిల్లాలోని మరో 12 మండలాల్లో ఇంటర్నెట్ సేవల రద్దును మరో 24 గంటల పొడగించారు. 
 
మరోవైపు, ఈ అల్లర్లలో పాత్ర ఉందని భావించి అరెస్టు చేస్తున్న వారి సంఖ్య 71కు చేరింది. మరింత మంది అనుమానితులను అరెస్టు చేసే శగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిదంబరం నటరాజస్వామి ఆలయ సంపద ఎంతో చెప్పాల్సిందే!?