Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యువతను మద్యానికి దూరంగా వుంచుతాం... అవసరమైతే నేనూ దాడుల్లో పాల్గొంటా... ఏపీ ఎక్సైజ్ మంత్రి

అమరావతి : సమర్థతకు, పనికి ప్రత్యామ్నాయం ఏమీ ఉండదని, తనకు ఇచ్చిన శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తానని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ అన్నారు. సచివాలయం 4వ బ్లాక్ లో తనకు కేటాయించిన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించా

Advertiesment
యువతను మద్యానికి దూరంగా వుంచుతాం... అవసరమైతే నేనూ దాడుల్లో పాల్గొంటా... ఏపీ ఎక్సైజ్ మంత్రి
, బుధవారం, 12 ఏప్రియల్ 2017 (18:54 IST)
అమరావతి : సమర్థతకు, పనికి ప్రత్యామ్నాయం ఏమీ ఉండదని, తనకు ఇచ్చిన శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తానని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ అన్నారు. సచివాలయం 4వ బ్లాక్ లో తనకు కేటాయించిన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించారు. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఎస్ఐ స్థాయి అధికారికి కూడా సిమ్ ఇవ్వడానికి సంబంధించిన ఫైల్ పైన రెండవ సంతకం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీవెనలతోనే ఎమ్మెల్యేనీ, మంత్రిని అయ్యానన్నారు. 
 
తనపై నమ్మకంతో దళితుడినైన తనకు ఎక్సైజ్ వంటి ముఖ్య శాఖని అప్పగించారన్నారు. తాను మంత్రి పదవి అడగలేదని, సీఎంగారే ఇచ్చారని చెప్పారు. బాధ్యతలు స్వీకరించే ముందు ఈ శాఖకు సంబంధించిన విషయాలు తెలుసుకొని అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖను తాము ప్రధాన ఆర్థిక వనరుగా చూడటంలేదన్నారు. మద్యం సేవించడాన్ని తాము ప్రోత్సహించం అని చెప్పారు. యువత మద్యం, మాదక ద్రవ్యాలవైపు మళ్లకుండా, మత్తుకు బానిసలు కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఎడిక్షన్ కేంద్రాల ద్వారా యువతను మత్తుకు దూరంగా ఉంచుతామన్నారు.
             
సమాచార విప్లవాన్ని పూర్తీగా సద్వినియోగం చేసుకొని తమ శాఖలో అవకతవకలు జరుగకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు. తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. సమర్థతకు, పనికి పత్యామ్నాయంలేదని చెప్పారు. మద్యం తాగటానికి టార్గెట్ ఏమీ లేదన్నారు. తమ శాఖ తరపున యాఫ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మద్యంని టెట్రా ప్యాకెట్లలో సరఫరా చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. 
 
అవకతవకలు జరుగకుండా గోడౌన్ వద్ద నుంచి మద్యం లారీ బయలు దేరిన తరువాత దిగుమతి జరిగే పాయింట్ కు చేరే వరకు ట్రాకింగ్ విధానం ద్వారా  నిఘా ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్నారు. కోర్టు నిబంధనల ప్రకారం  గ్రామానికి 500 మీటర్ల దూరంలో మద్యం షాపు ఏర్పాటుకు, 20వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు 220 మీటర్ల దూరంలో  షాపులు ఏర్పాటుకు అనుమతి ఇస్తారని వివరించారు.
 
ఎమ్మార్పీ ధరలకు మించి మద్యాన్ని విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఇటువంటి నేరానికి లక్ష రూపాయలు ఫైన్ విధిస్తున్నారని, ఇక ముందు అలా చేయాలంటే భయపడే స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. మద్యం కల్తీని నిరోధించేందుకు అవసరమైన చర్యలన్నిటినీ తీసుకుంటామన్నారు. అవసరమైతే తాను కూడా దాడులలో పాల్గొంటానని, అటువంటి చర్యలకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ ను కూడా ప్రయోగిస్తామని మంత్రి హెచ్చరించారు.
           
మంత్రి మండలి సమావేశం, ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే తప్ప ప్రతి సోమవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సచివాలయంలో తాను అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. శాఖలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తానన్నాను. రాజకీయాలకు ఆస్కారంలేకుండా బాధ్యతలు నిర్వహిస్తానని మంత్రి జవహర్ చెప్పారు.
 
ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలు
ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా వంద చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. మొదటగా గురువారం ఏలూరులో ప్రారంభించనున్నట్లు మంత్రి జవహర్ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నైజీరియాలో వ్యాపిస్తున్న మెదడు వ్యాపు.. 489 మంది మృత్యువాత.. మరో ఐదువేల మందికి?