ఆ రెండు పత్రికా సంస్థల అధిపతుల పనిబట్టేందుకే జీవో 2430ను తెచ్చినట్టు ఏపీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఏపీ సర్కారు తెచ్చిన ఈ జీవోపై ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
దీనిపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, వైఎస్ జెయింట్ పర్సనాలిటీ కాబట్టి అప్పట్లో ఆర్కే, రామోజీరావులను ఎదుర్కోగలిగారన్నారు. ఆర్కే, రామోజీరావు తనను అడ్డుకోవడమేంటని వైఎస్ జీవో 938 తెచ్చారని పేర్కొన్నారు.
ఆ తర్వాత ఆయన జీవోను అబయన్స్‌లో పెట్టారని అన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం కాళ్ల పారాణి ఆరనే లేదు.. తమపై ఆంధ్రజ్యోతి, ఈనాడు దాడి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలియకే కొత్త జీవో తెచ్చామని చెప్పారు. తనకు కోటి రూపాయలు పెట్టినా రాని పబ్లిసిటీ.. ఆంధ్రజ్యోతి ఆర్కే వీకెండ్ కామెంట్‌లో నా పేరు ప్రస్తావించడం వల్ల వచ్చిందన్నారు.